ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తైన తర్వాత ఫలితాలు పూర్తిస్థాయిలో వైసీపీకే పాజిటివ్ గా ఉన్నాయని తెలుస్తోంది. సీఎం జగన్ సైతం తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ లో
 వైసీపీ మళ్లీ అధికారంలో వస్తుందని ప్రజలకు సుపరిపాలన అందిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల తర్వాత కడప పార్లమెంట్ పరిధిలో అవినాష్ రెడ్డికే అనుకూల పరిస్థితులు ఉన్నాయని సమాచారం అందుతోంది. షర్మిల పొలిటికల్ కెరీర్ కు చెక్ పడినట్లేనని తెలుస్తోంది.
 
అవినాష్ రెడ్డిపై షర్మిల, సునీత ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు మాత్రం ఆమె కామెంట్లను పెద్దగా పట్టించుకోలేదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తొంది. అవినాష్ రెడ్డి గత ఐదేళ్లలో కడప అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలే ఆయనను మరోమారు ఎంపీగా గెలిపించనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అవినాష్ పై పోటీ చేయడమే షర్మిల చేసిన అతి పెద్ద తప్పు అని తెలుస్తోంది.
 
షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోకపోవడం వల్లే ఆమె ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారని కూడా కడప ఓటర్లు భావించినట్టు భోగట్టా. కడప ఎంపీగా గెలిచి మరో 20, 25 సంవత్సరాలు రాజకీయాల్లో కొనసాగాలని షర్మిల వేసుకున్న ప్లాన్స్ కు చెక్ పడినట్లేనని సమాచారం. జగన మద్దతు ఉండటం వల్ల అవినాష్ గెలుపునకు ఢోకా లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
 
మరోవైపు 2019 మ్యాజిక్ రిపీట్ అవుతుందని జగన్ బలంగా నమ్ముతున్నారని తెలుస్తోంది. సింపతీ ఓట్లు కూడా మనకు ప్లస్ అవుతాయని ఆయన ఫీలవుతున్నట్టు భోగట్టా. 150 కంటే ఎక్కువ స్థానాలు మళ్లీ వైసీపీకి వస్తాయని జగన్ చెప్పినట్టు ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తోంది. వైసీపీ రాష్ట్రంలో మళ్లీ 150 కంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తే మాత్రం సంచలనం అవుతుందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. సీమ జిల్లాల్లో అనుకూల పరిస్థితులు ఉండటం వైసీపీకి కలిసొస్తుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: