ఉమ్మడి రాయలసీమ జిల్లాలలో సీఎం జగన్ ను ఎంతలా అభిమానిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ పాలనలోనే రాయలసీమలో అంతోఇంతో అభివృద్ధి జరిగింది. వైసీపీ సీమ జిల్లాల నుంచి మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని ఇప్పటికే పలు సర్వేలలో వెల్లడైన సంగతి తెలిసిందే. అయితే సీమలో వైసీపీని ఓడించాలని కూటమి నేతలు దారుణంగా కుట్ర చేశారని తెలుస్తోంది.
 
సీమలో ఎక్కువమంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీళ్లలో నిరక్షరాస్యలు ఎక్కువగా ఉన్నారు. అయితే మౌత్ పబ్లిసిటీ ద్వారా జగన్ మళ్లీ సీఎం అయితే మీ భూములు మీవి కావని, మీ పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు అని రెచ్చగొట్టేలా ప్రచారం జరిగినట్టు తెలుస్తోంది. ఈ విధంగా జరిగిన ప్రచారం వల్ల కొన్ని చోట్ల వైసీపీకి పడాల్సిన ఓట్లు కూటమి నేతలకు పడ్డాయని భోగట్టా.
 
అయితే చంద్రబాబు గురించి ఆయన ప్రణాళికల గురించి అంతోఇంతో అవగాహన ఉన్నవాళ్లు మాత్రం ఆయన మాయమాటలను నమ్మలేదని తెలుస్తోంది. కూటమి నేతలు చేసిన వైసీపీకి మెజారిటీ తగ్గే ఛాన్స్ ఉంది తప్ప పూర్తిస్థాయిలో రిజల్ట్ మారిపోయే పరిస్థితులు లేవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. దుష్ప్రచారంతో అధికారంలోకి రావాలని భావించడంలో కూటమికి కూటమే సాటి అని వైసీపీ ఫ్యాన్స్ చెబుతున్నారు.
 
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లాంటి మంచి చట్టానికి సైతం దుష్ప్రచారం చేసిన ఘనత కూటమికే దక్కుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఇంత చేసినా కూటమి అధికారంలోకి రాకపోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి . ఏపీలో వైసీపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని త్వరలో జగన్ ప్రమాణ స్వీకార తేదీని ప్రకటిస్తామని వైసీపీ నేతలు వెల్లడించారు. వైసీపీ నేతల నమ్మకం నిజమవుతుందో లేదో చూడాలి. వైసీపీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మాత్రం టీడీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ మాత్రం గెలుపు విషయంలో ధీమాగా ఉన్నారని భోగట్టా.
 


మరింత సమాచారం తెలుసుకోండి: