ఏపీలో మరొకసారి వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందని.. గతంలో కంటే ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు వస్తాయని తన అభిప్రాయంగా సీఎం జగన్ మరొకసారి వెల్లడించారు.. ఈ రోజున మే 16న ఐ ప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ అయి విజయవాడలో బెంజ్ సర్కిల్ లో ఉన్న ఐప్యాక్ ఆఫీసుకు సైతం చేరుకొని అక్కడ టీముకి సైతం కృతజ్ఞతలు తెలియజేశారు.. ముఖ్యంగా అక్కడికి సీఎం జగన్ రాకతో ఐప్యాడ్ టీం సభ్యులు ఆయనకు  ఘనస్వాగతం కూడా తెలియజేశారు.


ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ కోసం పని చేసిన ఈ ఐప్యాడ్ టీం ప్రతినిధులను అభినందించారు సీఎం జగన్.. మే 17న విదేశీ పర్యటనలో భాగంగా కుటుంబంతో కలిసి జగన్ లండన్ కి వెళ్ళబోతున్నారు ఇలాంటి సమయంలో ఏపీలో జరిగిన పోలింగ్ శాతం విజయ అవకాశాల పైన అయితే ప్రతినిధులతో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో తమ పార్టీ విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయనే విషయం పైన కూడా సమాచారం అడిగినట్లుగా తెలుస్తోంది. అలాగే జగన్ తో పాటు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రి బొత్స ఉన్నట్టుగా సమాచారం.


ఐ ప్యాడ్ టీమ్ తో మాట్లాడిన తర్వాత జగన్ మాట్లాడుతూ మరొకసారి ఆంధ్రాలో అధికారంలోకి వస్తున్నామని.. గతంలో కంటే ఎక్కువ సీట్లు వస్తాయనే అభిప్రాయం తమకు ఉందని.. గత ఏడాదిన్నరగా ఐ ప్యాడ్ టీం అందించిన సేవలు వెలకట్టలేనిది అంటూ కూడా తెలియజేశారు.. ఈసారి ఏపీలో వచ్చే ఫలితాలు చూసి దేశం షాక్ అవుతుందని కూడా వెల్లడించారు.. ఈ ఐదేళ్లలో మించిన గొప్ప పాలను కూడా అందిస్తామంటూ తెలియజేశారు.. 2019లో వైఎస్ఆర్ సీపీకి 151 స్థానాలు వచ్చాయని.. ప్రజలు కూడా సుపరిపాలన చూసి మద్దతు ఇచ్చారనే విధంగా తెలియజేశారు. ప్రస్తుతం సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఈ మాటలతో అటు వైసీపీ నేతలు, కార్యకర్తలు,  అభిమానులు సోషల్ మీడియా లో  తెగ సంబరాలు చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: