ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. ఈ సారి ఎలక్షన్స్ ఒక యుద్దాన్ని తలపించాయి.రాష్ట్రం లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గరి నుంచి ఏపీ లో వైసీపీ, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయి కి చేరింది.ఆఖరికి పోలింగ్ రోజు కూడా విపరీతంగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి.ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో జరిగిన బీభత్సం ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, గురజాల నియోజకవర్గాల లో పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు  చేసుకున్నారు. దీంతో పోలింగ్ రోజు ఏపీ లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు రంగం లోకి దిగి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంతో.. చెదురుమదురు ఘటనలు మినహా అర్థరాత్రి వరకు జరిగిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతం గా ముగిసింది. అయితే భారీ సంఖ్య లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
దీనితో 81.86 శాతం పోలింగ్ నమోదైంది. 

అయితే పల్నాడు జిల్లాలో పోలింగ్ తరువాత రోజుకూడా కొట్లాటలు ఆగలేదు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూనే వున్నారు.టీడీపీ నేతలు, కార్యకర్తలు తమపై దాడులు చేశారని, ఏపీ పోలీసులు సైతం వారికే సహకారం అందించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే దాడులకు పాల్పడిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి  వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యం లో వైసీపీ నేత అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. పోలింగ్ రోజున కూటమి లో నాలుగో పార్టనర్ గా ఏపీ పోలీసులు వచ్చి చేరారు.. కూటమి విజయం కోసం వారు ఎంతగానో కృషి చేశారు.కానీ జగన్ మోహన్ రెడ్డి మరోసారి సీఎం అవుతున్నారని అంబటి ధీమా వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలంతా జగన్ వెంటనే ఉన్నట్లు ఆయన తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: