జనసేన అధినేత పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుస్తాడని చాలామంది అంటున్నారు. పిఠాపురం వాసులు వంగా గీతని కాదని, అతనికే ఓటు వేశారని ఓటింగ్ సర్వేను బట్టి కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. వారి ప్రకారం చూసుకుంటే ఈసారి పవర్ స్టార్ అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇదిలా ఉండగా పవన్ రీసెంట్ టైమ్‌లో తన భార్య అన్నాను వెంట బెట్టుకొని తిరుగుతున్నారు. ఏ కార్యక్రమానికి వచ్చినా సతీ సమేతంగానే వస్తున్నారు. దీనికి కారణమేంటంటే ఆయన నాలుగో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ రూమర్స్‌కు చెక్ పెట్టాలని పవన్ మూడో భార్యను తీసుకొని, తనతో అంతా బాగానే ఉందని స్పష్టం చేస్తున్నారు. జోక్ ఏంటంటే, పవన్ భార్యకు ఓటుహక్కు లేదు. అయినా ఆమెను పోలింగ్ బూత్ కు తీసుకొచ్చి, మూడో భార్యతో తాను అన్యోన్యంగానే జీవిస్తున్నానని, ఆమెను వదిలి పెట్టేది లేదని చెప్పకనే చెప్పారు.

మోదీ నామినేషన్ చేస్తున్నప్పుడు పవన్‌ను అతిథిగా పిలిచారు. దానికి కూడా తన భార్య అన్నాను పవన్ తీసుకెళ్లారు. దీని తర్వాత కాశీ విశ్వనాథుని ఆలయానికి కూడా ఆమెతోనే వెళ్లి అభిషేకం కార్యక్రమాలు పూర్తి చేశారు. ఈ సమయంలో యూపీ పర్యాటక మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా పవన్, అన్నా పక్కనే ఉండి వారికి అన్ని సేవలను చేశారు. ఎప్పుడూ లేని విధంగా పవన్ భార్యను ఎందుకు ఇలా బహిరంగంగా భారతదేశమంతటా తిప్పుతున్నారు అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. తప్పుడు ప్రచారాలు వాదనలకు కళ్లెం వేయడానికే పవన్ ఇలా చేస్తున్నారని చాలామంది అంటున్నారు.

 పవన్ అయితే వాటికి బలంగానే బదులు చెప్పారు. పవన్ చేసుకున్న భార్య ఒక విదేశీ రాయులైన ఆమె గురించి కొంతమంది తప్పుగా కూడా మాట్లాడుతున్నారు. వారి నోర్లు సైతం మూయించేందుకు పవన్ తన సతీమణి నేను వెంటబెట్టుకుని ప్రతి చోటుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వ్యక్తిగత విషయాలపై కామెంట్లు చేయడం ఎవరికీ తగిన విషయం కాదు. జగన్ తో పాటు వైసిపి నేతలు అందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నడుచుకోవడం మంచిది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: