ఎన్నికలకు ముందు తెగ రెచ్చిపోయిన జనసైనికులు పోలింగ్ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు అంటూ టిడిపికి జనసేన గాని గెలుపు గురించి పెదవి ఏం మెదపడం లేదు. దీనికి ప్రధాన కారణం పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోతారని జన సైనికులు నమ్ముతున్నారు. టీడీపీలో కలిసినా ఆ ఓట్లు పవన్‌కి పడలేదని వారు నమ్ముతున్నారు. ఒక కాపు సామాజిక వర్గ ప్రజల ఓట్లు తప్ప మిగతా కులాల వారి ఓట్లు అన్ని వైసీపీకే పడిపోయాయని అనుకుంటున్నారు. జులై 4 తర్వాత జనసేన పార్టీ ఉనికిలో లేకుండా పోతుంది అని కూడా కామెంట్లు చేస్తున్నారు.

 పవన్ కళ్యాణ్ కోసం జనసేన కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు ఒకవేళ ఆయన ఓడిపోతే చేతగాని నాయకుడు ఒక్కసారి కూడా గెలవలేకపోయాడు అని తిట్టుకుంటూ వాటిని వీడే అవకాశం లేకపోలేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేన పార్టీ ఏర్పాటయి 10 ఏళ్ళు కంటే ఎక్కువ సమయం గడిచిపోతోంది. ఇంత కాలమైనా జగన్ ఒకసారి కూడా అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. బయట మాత్రం సింహం పులి లాగా ఊగిపోతూ స్పీచ్ లు ఇస్తారు కానీ సింగిల్ సీటు కూడా గెలిచేతలో తన నాయకత్వాన్ని, తన సామర్థ్యాన్ని చూపించలేకపోతున్నారు.

 నిజం చెప్పాలంటే పవన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్లే ఆయన ఓడిపోతున్నారు, రాజకీయంగా ఎదగలేక పోతున్నారు. ఉదాహరణకి ఈసారి టిడిపిలో పొత్తుకుదురుచుకున్న ఆయన కేవలం 21 సీట్లు కేటాయించగానే సంబరపడిపోతూ ఒప్పుకున్నారు 21 సీట్లతో సీఎం అయ్యే ఛాన్సే లేదు ఆయన సీఎం కావాలనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సీఎం హోదాలో ఉంటేనే ఏపీ రాష్ట్ర ప్రజలందరూ మంచి చేయడం కుదురుతుంది. అదే లక్ష్యంతో పవన్ పొలిటిషన్ గా మారారు ఇప్పుడు టిడిపి కోసం ఆ కలను సింపుల్గా వదులుకోవడం చాలామందిలో నిరాశను కలిగించింది. సీఎం, సీఎం అంటూ పవన్‌ను కుర్చీలో చూడాలని ఆశపడ్డ వారందరూ ఇప్పుడు బాగా నిరాశ పడుతున్నారు.

 పవన్ ప్రజలకి మంచి చేస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పనేలేదు. కేవలం వైసీపీ అధినేత జగన్ పై అక్కసు వెళ్ళగక్కుతూ కనిపించారు. జగన్ ను తిట్టడం, విమర్శించడం, ఎగతాళి చేయడం వరకే పరిమితమయ్యారు. జనసేన పార్టీలో పదేళ్లుగా ఉంటూ కష్టపడుతూ ఆ పార్టీ కోసం సర్వస్వం ధారపోసిన వారికి సీట్లు ఇవ్వకుండా పవన్ చాలా పెద్ద తప్పు చేశారు. మొత్తం మీద తన కోసం, జనసేన పార్టీ నేతల కోసం ఏమీ చేయకుండా, మొత్తం టీడీపీ కోసమే ఆయన త్యాగం చేస్తూ కోపం తెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: