ఇటీవలే ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలలో టిడిపి గెలుస్తుందని అంతే ధీమాతో ఉంటున్నారు.. అటు వైసిపి కూడా గెలుస్తుందని దిమాని వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఈసారి టిడిపి ,జనసేన ,బిజెపి, కలిసి కూటమిగా ఏర్పడి వైసిపి పార్టీ పైన రాజకీయ యుద్ధానికి దిగాయి. ఈ మూడు పార్టీల బలంతో వైసీపీని ఓడించాలని ఎన్నో ప్రణాళికలు కూడా వేశాయి. ఇదంతా ఇలా ఉంటే ఎన్నికలలో టిడిపి కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ పరిస్థితి ఏంటి అనే విషయం పైన మిలియన్ డాలర్ల ప్రశ్న ఎదురవుతోంది.


2014 ఎన్నికలలో టిడిపి గెలిచిన తర్వాత చంద్రబాబు మంత్రివర్గంలో కీలక శాఖ మంత్రిగా కూడా లోకేష్ పని చేశారు. దీంతో 2019లో అధికారంలోకి వస్తే ఖచ్చితంగా లోకేష్ ని ముఖ్యమంత్రి చేయడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు.. కానీ చంద్రబాబు అప్పట్లో ఓడిపోయారు. ఇప్పుడు తాజగా టిడిపి కూటమి గెలిస్తే లోకేష్ ను ముఖ్యమంత్రిగా చేస్తారా అనే విధంగా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఒకవేళ సొంతంగా టిడిపి పార్టీకి 105 సీట్లు వస్తేనే లోకేష్ ని ముఖ్యమంత్రి చేయడానికి చంద్రబాబు అంగీకరిస్తారని తెలుస్తోంది.


ఒకవేళ అంతకంటే తక్కువ స్థానాలు వస్తే కూటమిలో కచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయని ముఖ్యంగా జనసేన బిజెపి సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.ఒకవేళ లోకేష్ ను ప్రకటిస్తే కచ్చితంగా కూటమిలో చాలామంది నేతలు అడ్డు చెబుతారని సమాచారం. ఒకవేళ రాబోయే ఎన్నికల పరిస్థితుల్లో ఇలాంటి పరిస్థితులు అయితే కనిపించవు.. ఎందుకంటే టిడిపి పార్టీని చంద్రబాబు వీడి తన వారసుడిగా లోకేష్ ని ప్రకటించబోతున్నట్లు సమాచారం.


ఒకవేళ లోకేష్ సీఎం కాకపోవడానికి ముఖ్య కారణం తన తండ్రి అని చెప్పవచ్చు.. తన తండ్రి జైలులో ఉన్నప్పుడు జనసేన పార్టీతో పొత్తుని ఒప్పించి చివరికి జనసేన పార్టీ నుంచి బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకునేలా చేశారు.. ఇప్పుడు ఇదే టిడిపికి చిక్కుగా మారుతోంది. ఆరోజు పొత్తు లేకుండా ఉండి ఉంటే ఒకవేళ లోకేష్ టిడిపి గెలిస్తే ఐదేళ్ల లోపు  ఎప్పటికైనా సీఎం హోదాలో ఉండేవారని పలువురు అభిమానులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కూటమితో టీడీపీ గట్టెక్కిన రాబోయే రోజుల్లో చాలా ఇబ్బందులు తప్పవని దీంతో లోకేష్ సీఎం అవ్వడం కూడా చాలా కష్టమని కూడా పలువురు నేతలు వాపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: