ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు మూసాయి ఇంకా 40 ఏళ్లలో జరగని విధంగా అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ శాతం నమోదయింది. ఈ నేపథ్యంలో ఎవరికి వచ్చిన భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏపీలో జగన్ గెలుస్తారని చాలామంది నమ్ముతున్నారు. సీఎం ఎవరు అవుతారని దానిపై ఎంతగా చర్చ జరుగుతుందో, నాలుగు కీలక స్థానాల ఫలితాలపై కూడా అదే స్థాయిలో చర్చ జరుగుతోంది. ఈ స్థానాలలో ఎలాగైనా గెలవాలని వైసీపీ చాలా ప్రయత్నించింది. ఈ స్థానాల్లోనే ఎక్కువ పోటీ ఉంటుంది అందుకే ఇక్కడే బాగా ఫోకస్ చేసింది. మరి ఆ స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఎవరికి ఉంది? ఇప్పుడు తెలుసుకుందాం...!

- కుప్పం

చంద్రబాబుకు కుప్పం కంచుకోట. బాబు ప్రతి ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుస్తూ వస్తున్నారు. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించాలని వైఎస్ జగన్ ఒక లక్ష్యం పెట్టుకున్నారు. అందులో భాగంగ వైసీపీ అభ్యర్థి భరత్ గెలిపించాలని కోరారు. ఆయన్ను గెలిపిస్తే వెంటనే మంత్రిని చేసి కుప్పం అభివృద్ధికి బాటలు వేస్తానని భరోసా ఇచ్చారు. కుప్పంలో మున్సిపాలిటీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో వైసీపీ ఆల్రెడీ టీడీపీపై గెలిచి చూపించింది. ఇప్పుడు చంద్రబాబును ఓడించాల్సిన సమయం వచ్చింది. కానీ అది అంత ఈజీ కాదని అంటున్నారు దొంగ ఓట్లు తీసేసిన తర్వాత కూడా చంద్రబాబు స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎవరు గెలుస్తారో చూడాలి!

- పిఠాపురం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అభ్యర్థి వంగా గీత పిఠాపురం ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ కాపు సామాజిక వర్గ ప్రజలు ఎక్కువ. అది పవన్ కు ప్లస్ అవుతుంది. ఇక మెగా ఫ్యామిలీతో సహా జబర్దస్త్, స్మాల్ స్క్రీన్ నటులు అందరూ పవన్ గెలుపు కోసం ప్రచారాలు చేశారు. ఆయనకే ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించారు. అయితే వీటన్నిటికీ కౌంటర్ గా జగన్ ఒకటే మాట అన్నారు. వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానని మాట ఇచ్చారు. దీంతో ప్రజలు వైసీపీ వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది. ఇక్కడ వంగా గీత గెలవడానికి ఎక్కువగా ఛాన్స్ అని ఇంటర్నల్‌గా చర్చలు జరుగుతున్నాయి.

- మంగళగిరి

టీడీపీ యువనేత నారా లోకేష్ డబ్బులు పంపిణీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గకపోయినా ఆయనను మాత్రం ప్రజలు గెలిపించడం లేదు. 2019లో మంగళగిరి నుంచి కంటెస్ట్ చేసిన లోకేష్ వైసీపీ అభ్యర్థి ఆర్కేపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. 5,337 ఓట్లు తక్కువగా రావడంతో ఆయన ఎమ్మెల్యే కాలేకపోయారు. అయితే ఈసారి 50వేల మెజారిటీతో తన గెలుస్తానని లోకేష్ ధీమాగా చెబుతున్నారు. అయితే లోకేష్‌ను ఓడగొట్టేందుకు మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా మురుగుడు లావణ్యను జగన్ రంగంలోకి దింపారు. లోకేష్ పై విజయం సాధించేందుకు జగన్ కొన్ని వ్యూహాలను అమలు చేశారు అవి సక్సెస్ అయితే ఈసారి కూడా లోకేష్ ఓడిపోతారు కానీ రాజకీయ విశ్లేషకులు ఆయన గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు.

- హిందూపురం

నందమూరి బాలకృష్ణ హిందూపురంలో బ్యాక్ టు బ్యాక్ విజయం సాధించారు. 2014లో 16వేలు, 2019లో 18వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. మళ్లీ తనదే గెలుపు అని బాలకృష్ణ అంటున్నారు. అయితే ఈ కీలక టీడీపీ నేతను ఓడించడానికి కూడా వైసీపీ అనేక వ్యూహాలను పన్నింది  కోడూరి దీపికను బరిలోకి దింపి బీసీ అస్త్రం వాడింది. అయితే గాలి బాలకృష్ణ వైపే ఉందని సమాచారం. జగన్ ఒకసారైనా బీసీ నేతను గెలిపించుకోండి అన్నట్లు ప్రచారం చేశారు. ఒకవేళ ప్రజలు కూడా అలానే అనుకుంటే బాలకృష్ణ హ్యాట్రిక్‌ కలగానే మిగిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: