మెగా బ్రదర్ నాగబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎప్పుడు సపోర్ట్ గానే నిలుస్తుంటారు. ప్రస్తుతం జనసేన టిడిపి కూటమిలో కలిసింది. ఆ కూటమి జగన్ పై వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఇందులో టీడీపీ+ గెలవాలని మెగా బ్రదర్ బాగా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాగ్రత్త అంటూ ఆయన కొందరికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అదేంటంటే నాగబాబు పోలింగ్ ముగిసిన ఆ తర్వాత కూడా మోసాలు చేసే ప్రమాదం ఉందని నమ్ముతున్నాడు. స్ట్రాంగ్ రూముల్లో ఉంచిన ఈవీఎంసీ మార్చేసే ఛాన్స్ ఉందని ఆయన అనుకుంటున్నాడు. అందువల్ల పోలింగ్ పూర్తయినా సరే ప్రశాంతంగా ఉండొద్దని, కౌంటింగ్ మూగిసే వరకు కూటమినేతలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఓటమి భయంతో వైసీపీ పార్టీ నేతలు అరాచకాలు, అక్రమాలకు పాల్పడతారని అన్నారు. ఆల్రెడీ వైసీపీ వాళ్లు పల్నాడు, తాడిపత్రి, తిరుపతిల్లో అరాచకానికి పాల్పడి టీడీపీ+ ఓట్లు తగ్గేలా చేశారని ఆరోపించారు. ఏపీలో ఎక్కువ శాతం ఓట్లు పోల్ కావడం ప్రజాస్వామ్య విజయం అని పేర్కొన్నారు. పోలింగ్ శాతం సంబరపడితే సరిపోదని కౌంటింగ్ పూర్తయ్యే వరకు వైసీపీ వారి కదలికలను గమనించాలని పిలుపునిచ్చారు.

జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు వ్యవహరిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ "ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని సైకోపాత్ అని చాలామంది అంటుంటారు ఆయన కోవలోకి వస్తాడో లేదో తెలియదు గాని అతను మాత్రం కచ్చితంగా ఒక సోషియోపాత్. అంటే కులాలు, వర్గాలు, పార్టీల వారీగా జనాలను విడగొట్టి ఆనందిస్తాడు. ఆ సోషియోపాత్ మానసిక రోగం బాగా ముదిరింది. ఓడిపోతామని భయంతో ఆయనతో పాటు వైసీపీ నేతల్లో కనిపిస్తోంది ఆ భయంతో వారు ఉన్మాదులుగా మారుతున్నారు  ఇళ్లపై అరాచకాలకు పాల్పడుతున్నారు." అని షాకింగ్ కామెంట్స్ చేశారు.

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అనుచరుల ఇళ్లలో పెట్రోలు బాంబులు దొరికాయని కూడా నాగబాబు ఆరోపించారు. ఫలితాలు వ్యతిరేకంగా వస్తే వైసీపీ వాళ్లు ఈ బాంబులతో ఎలాంటి దాడులకు తెగబడతారో అని భయం కలుగుతోందని అన్నారు. తాడిపత్రిలో పోలీసులకే రక్షణ లేకుండా పోయింది అంటే వైసీపీ వాళ్లు ఎంత ఉన్మాదులుగా మారారు అర్థం చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. వైసీపీకి ఓటు వేయలేదు అనే అనుమానం వస్తే చాలు ఆ ప్రజల ఇంట్లోకి వెళ్లి చావు కొట్టి పైశాచికత్వాన్ని ప్రదర్శించారని ఆరోపించారు. ఇన్ని ఘోరాలు చేస్తూ బయటికి మాత్రం నవ్వే జగన్ ని చూస్తే స్పైడర్ సినిమాలో ఎస్.జె.సూర్య జ్ఞాపకం వస్తున్నాడు అని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: