ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజమండ్రి లోని రాజానగరం నియోజకవర్గంలో జరిగిన పోలింగ్ సర్వత్ర ఉత్కంఠత రేపుతుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుండి జక్కంపూడి రాజా ఎమ్మెల్యేగా గెలుపొందారు. టిడిపి అభ్యర్థి పెందుర్తి రమేష్ మీద 39వేల మెజారిటీతో గెలుపొందారు రాజా. ఎన్నికల్లో కూటమి నుంచి జనసేన అభ్యర్థి బరిలో దిగింది. ఈసారి జరిగిన పోలింగ్ తీరును బట్టి ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ ఉందని తెలుస్తుంది. దాంతో రాజానగరం ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గట్టి పోటీ ఇవ్వడంతో ఈసారి గెలుపు అనేది నువ్వా నేనా అన్నట్టు ఉన్నదని లోకల్ పబ్లిక్ టాక్. ఒకచోట బత్తుల ముందంజలో ఉంటే ఇంకోచోట రాజా ముందున్నట్లు తెలుస్తుంది.
 అయితే కోరుకొండ మండలం దాదారాడ నుండి ఎంపీటీసీగా గెలిచిన బత్తుల బలరామకృష్ణ మొదట్లో వైసీపీలో ఉండేవాళ్ళు అలాగే 2019ఎన్నికల్లో జక్కంపూడి రాజాకు మద్దతుగా కూడా నిలిచారు తర్వాత కొన్ని అంతర్గత కారణాల వల్ల వైసీపీని వీడి జనసేనలో చేరారు.తర్వాత పార్టీ అభ్యర్థిగా రాజానగరం నుండి బరిలో దిగారు. పోలింగ్ తర్వాత చాలాచోట్ల గ్లాస్ గుర్తుకు ఓటింగ్ జరిగిందని అలాగే ఫ్యాన్ గాలి కూడా బాగానే వీసిందని అక్కడ లోకల్ ప్రజల్లో చర్చ జరుగుతుంది. రాజానగరం నియోజకవర్గంను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారంలోభావోద్వేగానికి లోనయ్యారు. అయితే తగ్గేది లేదంటూ జక్కంపూడి రాజా తరపున సీఎం జగన్ అక్కడే తన ప్రసంగం చేశారు. జనం భారీగా తరలివచ్చారు దాంతో గాలి ఎటువైపు మళ్లుతుంది అనేది అక్కడ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  జక్కంపూడి రాజా వాళ్ళ అమ్మగారు ఓడిపోయిన సంగతి తెలిసిందే అయితే 2019 ఎన్నికల్లో రాజా భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ప్రభుత్వం పై వ్యతిరేకత ప్రజల్లో ఉన్న అసంతృప్తి తనకు కలిసి వస్తాయని జనసేన అభ్యర్థి కొండంత ఆశగా ఉన్నారు. అలాగే టిడిపి యొక్క మద్దతు ఉమ్మడి పిఠాపురం జిల్లా నుంచి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ  అనే అంశాలు తనకు కలిసి వస్తాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసేన అభ్యర్థి.అయితే రాజానగరంలో ప్రస్తుతం ఎడ్జి ఎటువైపు ఉందో తెలియని పరిస్థితుల్లో ఉన్నారని కానీ ఏ పార్టీ గెలిచినా కూడా భారీ మెజారిటీ అయితే మాత్రం రాదనిపోటాపోటీగా మెజారిటీ వస్తుందని అంటున్నారు. దాంతో రాజానగరం రాజెవరో తేలాలంటే జూన్ 4 దాకా వేచి ఉండాలని విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: