- దేశానికి ప్ర‌ధాన‌మంత్రిని అందించిన ఘ‌న‌త‌ క‌ల్లు గీత కులానిదే
- 2024 ఎన్నిక‌ల్లో వైసీపీ 10... కూట‌మి నుంచి 7 గురికి టిక్కెట్లు
- ఏపీ సీఎం కుర్చీని డిసైడ్ చేసే రేంజ్ గౌడ‌న్న‌ల‌కే సొంతం

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

తెలుగు గ‌డ్డ‌పై క‌ల్లు గీత కార్మిక సోద‌రుల రాజ‌కీయ ప్ర‌స్థానం చెక్కు చెద‌ర‌నిది.. ఎవ్వ‌రూ చెర‌ప‌లేనిది. గ‌త కొన్ని ద‌శాబ్దాల నుంచి ఇంకా చెప్పాలంటే స్వాతంత్య్రానికి పూర్వ నుంచి వీరు భార‌తదేశ స్వాతంత్య్ర సంగ్రామంతో పాటు భార‌త, తెలుగు రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించారు. క‌ర్నాక‌ట‌లో గౌడ వ‌ర్గానికే చెందిన దేవ‌గౌడ క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి అవ్వ‌డంతో పాటు భార‌త‌దేశ ప్ర‌ధాన‌మంత్రి కూడా అయ్యారు. ఇక ఆయ‌న త‌న‌యుడు కుమార‌స్వామి సైతం క‌ర్నాట‌క‌ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేశారు.


ఇక తెలుగు గ‌డ్డ‌పై గౌడ / ఈ ఉప కులానికి చెందిన సోద‌రుల‌కు తిరుగులేని రాజ‌కీయ ప్ర‌స్థానం ఇచ్చిన ఘ‌త‌న ఖ‌చ్చితంగా తెలుగుదేశం పార్టీకే ద‌క్కుతుంది. అంత‌కుముందే స‌ర్దార్ గౌతు ల‌చ్చ‌న్న ఈ కులంలో ఆరాధ్యుడిగా ఉన్నా ఎన్టీఆర్ తెలుగుదేశంతో కొన్ని వంద‌ల మంది స్తానిక సంస్థ‌ల ప్ర‌జాప్ర‌తినిధుల నుంచి చ‌ట్ట‌స‌భ‌ల వ‌ర‌కు వెళ్లారు. ఇక తాజా 2024 ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అటు అధికార వైసీపీ, ఇటు ప్ర‌తిప‌క్ష కూట‌మి ఏయే నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ కులానికి చెందిన అభ్య‌ర్థుల‌కు సీట్లు ఇచ్చాయి... ఏ పార్టీ త‌ర‌పున ?  ఎక్క‌డ ? ఎవ‌రు పోటీ చేస్తున్నారో ?  ఈ లిస్టులో చూద్దాం.


2019 నుంచి వైసీపీ అధినేత జ‌గ‌న్ గౌడ‌, ఉప‌కులాల‌కు ఎక్కువ ప్ర‌యార్టీ ఇస్తున్నారు. శెట్టిబ‌లిజ‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రూ ఎంపీయే కాలేదు. అలాంటిది మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్ర‌బోస్‌కు రాజ్య‌స‌భ ఇవ్వ‌డంతో పాటు ఈ ఎన్నిక‌ల్లో ఏకంగా న‌ర‌సాపురం, రాజ‌మండ్రి రెండు ఎంపీ సీట్లు ఈ కులానికే ఇవ్వ‌డం సెన్షేష‌న‌ల్‌. ఈ ఎన్నిక‌ల్లో వైసీపీ రెండు ఎంపీ, 8 ఎమ్మెల్యే మొత్తం 10 సీట్లు ఈ వ‌ర్గానికి కేటాయించింది. ఇక కూట‌మి ఒక్క ఎంపీ సీటూ ఇవ్వ‌లేదు. ఏడు అసెంబ్లీ సీట్లు మాత్రం కేటాయించింది.


వైసీపీ నుంచి పార్ల‌మెంట‌కు పోటీ చేసిన గౌడ / ఉప కులాల అభ్య‌ర్థులు :
1)  డాక్ట‌ర్ గూడూరి శ్రీనివాస్ ( శెట్టి బ‌లిజ‌) - రాజ‌మండ్రి పార్ల‌మెంట్‌
2)  గూడూరి ఉమాబాల ( శెట్టిబ‌లిజ‌) - న‌ర‌సాపురం పార్ల‌మెంట్‌


వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన గౌడ / ఉప కులాల అభ్య‌ర్థులు :
1) మార్గాని భ‌ర‌త్‌రామ్ ( గౌడ‌) - రాజ‌మండ్రి సిటీ
2) చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ( శెట్టిబ‌లిజ ) - రాజ‌మండ్రి రూర‌ల్‌
3) పిల్లి సూర్య ప్ర‌కాష్ ( శెట్టిబ‌లిజ ) - రామ‌చంద్రాపురం
4) గుడాల గోపీ ( శెట్టిబ‌లిజ ) - పాల‌కొల్లు
5) పుప్పాల రామ్ ప్ర‌సాద్ ( గౌడ ) - పెడ‌న‌
6) జోగి ర‌మేష్ ( గౌడ ) - పెన‌మ‌లూరు
7) వేంక‌టే గౌడ ( గౌడ ) - ప‌ల‌మ‌నేరు
8) డాక్ట‌ర్ ఈపూరు గ‌ణేష్ ( గౌడ ) - రేప‌ల్లె


కూట‌మి నుంచి పార్ల‌మెంట‌కు పోటీ చేసిన గౌడ / ఉప కులాల అభ్య‌ర్థులు :
0) జీరో ఒక్క‌రు కూడా లేరు


వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన గౌడ / ఉప కులాల అభ్య‌ర్థులు :
1) గౌతు శిరీష ( శ్రీశాయ‌న‌) - ప‌లాస‌
2) వాసంశెట్టి సుభాష్ ( శెట్టిబ‌లిజ ) - రామ‌చంద్రాపురం
3) పితాని స‌త్య‌నారాయ‌ణ ( శెట్టిబ‌లిజ ) - ఆచంట‌
4) కాగిత వెంక‌ట కృష్ణ‌ప్ర‌సాద్ ( గౌడ‌) - పెడ‌న‌
5) అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్ (గౌడ ) - రేప‌ల్లె
6) కేఈ శ్యాంబాబు ( ఈడిగ ) - ప‌త్తికొండ‌
7) వీర‌భ‌ద్ర గౌడ్ ( లింగాయ‌త్ ) - ఆలూరు

మరింత సమాచారం తెలుసుకోండి: