రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా.. వెంట‌నే నాయ‌కులు కానీ, పార్టీలు కానీ.. కొన్ని కార‌ణాల‌ను వెతికి పెట్టుకోవ‌డం స‌హజం. ఇప్పుడు ఏపీలోనూ ఇదే జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు ఓడుతారు? అనేది ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌గామారిన విష‌యం తెలిసిందే. ఏదో ఒక పార్టీ మాత్ర‌మే గెలిచేందుకు అవ‌కాశం ఉంది. అయితే.. కూట‌మి, లేక‌పోతే వైసీపీ. ఇక‌, ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా.. త‌మ త‌మ కార‌ణాల‌ను వారు వెతికి పెట్టుకున్నారు.


దీనిలో రెండు ర‌కాలుగానూ.. కార‌ణాలు సిద్ధం చేసుకున్న‌ట్టు స‌మాచారం. అంటే.. గెలిస్తే.. ఎందుకు గెలిచామ‌నే కార‌ణాల‌ను, ఓడితే ఎందుకు ఓడామ‌నే కార‌ణాల‌ను కూడా బ‌లంగానే రెడీ చేసుకున్నార‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో సాధార‌ణంగా కార్య‌క‌ర్త‌ల‌పైనా.. నాయ‌కుల‌పైనే పెద్ద పార్టీలు ఈ నెపాన్ని నెట్టేస్తుంటాయి. గ‌త 2019లో టీడీపీ ఓడిపోయింది. దీనికి బాధ్య‌తగా.. అప్ప‌ట్లో ఏపీ టీడీపీ చీఫ్‌గా ఉన్న క‌ళా వెంక‌ట‌రావును కొన్నాళ్ల‌కు ప‌క్క‌న పెట్టారు.


కానీ, ఇప్పుడు అలా చేసే అవ‌కాశం లేకుండా.. ఇరు పార్టీల్లోనూ కీల‌క‌మైన నిర్ణ‌యాల దిశ‌గా ఆలోచ‌న చేస్తు న్నాయి. దీనిలో ప్ర‌ధానంగా.. వైసీపీ అయితే.. కూట‌మిపై విమ‌ర్శ‌లు చేసేందుకు రెడీ అయింది. లేనిపోని హామీలు ఇచ్చి.. త‌మ‌పై విష ప్ర‌చారం చేసి.. గెలిచార‌ని.. లేనిపోని అబ‌ద్ధాల‌ను ప్ర‌చారం చేశార‌ని వైసీపీ రెడీ చేసుకుంది. ఒక‌వేళ గెలిస్తే.. ఇదంతా కూడా సీఎం జ‌గ‌న్ క్రెడిటేన‌ని చెప్పుకొనేందుకు అంశాల వారీగా నివేదిక లు రెడీ చేసుకుంది. తాముఅమ‌లు చేస్తున్న సంక్షేమానికి ప్ర‌జ‌లు ఫిదా అయ్యార‌నేది దీనిలో కీల‌క‌మైన అంశం.


ఇక‌, కూట‌మి క‌నుక గెలిస్తే.. ఇదంతా రెండు రూపాల్లో ప్ర‌చారానికి అవ‌కాశంఉంది. ఒక‌టిసూప‌ర్ సిక్స్ అని టీడీపీ ప్ర‌చారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు పాల‌నను ప్ర‌జ‌లు కోరుకున్నార‌ని అందుకే గెలిపించార‌ని చెప్పుకొనే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇక‌, ఇక్క‌డ మరోకోణం కూడా ఉంది. మూడు పార్టీలు కూడా.. ఎవ‌రికి వారే.. సెల్ఫ్ గోల్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంది. అంటే.. మావ‌ల్లే గెలిచామ‌ని.. ప్ర‌ధాని మోడీ ప్ర‌చారం ప‌నిచేసింద‌ని.. బీజేపీ చెప్పుకొనేందుకు అవ‌కాశం ఉంది.


రేపు ప‌వ‌న్ కూడా..త‌న వ‌ల్లే గెలిచామ‌ని.. కూట‌మి క‌ట్టిందికూడా త‌న వ‌ల్లేన‌ని ఆయ‌న ప్ర‌చారం చేసుకునేందుకు చాన్స్ ఉంటుంది. ఇది ఇప్ప‌టికిప్పుడు కాక‌పోయినా.. త‌ర్వాత అయినా.. బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇక‌, టీడీపీ కూడా చంద్ర‌బాబు ఇమేజ్‌, తాము ప్ర‌క‌టించిన సూప‌ర్ సిక్స్ కార‌ణాల‌ని చెప్పుకొనే చాన్స్ ఉంది. మొత్తంగా చూస్తే.. ఎవ‌రి కార‌ణాల‌నువారు వెతికి పెట్టుకున్నారు. అవేంట‌నేది తెలియాలంటే.. జూన్ 4 వ‌ర‌కు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: