- 2  ఎంపీ సీట్ల‌తో పాటు 17 సీట్లు గెలుస్తామ‌ని జ‌న‌సేనాని అంచ‌నాలు
- ఈ ఐదు సీట్ల‌లో జ‌న‌సేన‌కు ట‌ఫ్ ఫైట్ త‌ప్ప‌దా...?

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో ఎన్నికల ముగిసాయి. కౌంటింగ్ ఒక్కటే మిగిలింది. జనసేన పోటీ చేసిన సీట్లలో ఎన్ని గెలుస్తుంది ?  ఎక్కడెక్కడ పడుతుంది.. అన్నదానిపై అటు రాజకీయ వర్గాలతో పాటు.. ఇటు జనసేన వర్గాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతుంది. విశ్వస‌నీయ వ‌ర్గాల సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కచ్చితంగా 16 నుంచి 17 అసెంబ్లీ సీట్లతో పాటు.. తాము పోటీ చేసిన రెండు లోక్‌స‌భ సీట్లు కాకినాడ, మచిలీపట్నంలో విజయం సాధిస్తామని ధీమాతో ఉన్నారట. రెండు ఎంపీ సీట్లలో గెలుపుపై పవన్ కు ఎలాంటి సందేహాలు లేవని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ సీట్లలో మాత్రం పాలకొండ, పోలవరం, రైల్వే కోడూరు సీట్లలో గెలుపు కష్టమే అన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.


అలాగే లోకం మాధవి పోటీ చేసిన నెల్లిమర్లతో పాటు వైసీపీ నుంచి ఎన్నికలకు ముందు జనసేనలో చేరి విశాఖ సౌత్‌లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్, అలాగే తిరుపతిలో పోటీ చేసిన ఎమ్మెల్యే అరుణ శ్రీనివాసులు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నారని చెబుతున్నారు. అలాగే రాజోలు - రాజానగరం - పి గన్నవరం నియోజకవర్గాలలో సైతం వైసీపీ అభ్యర్థుల నుంచి జనసేన అభ్యర్థులకు గట్టి పోటీ ఎదురైందని.. జనసేన వాళ్లు లెక్కలు వేసుకుంటున్నారు. అయినా ఈ మూడు చోట్ల గెలుపు త‌మే అంటున్నారు.


ఎలా లేదన్న మొత్తం 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో తాము కచ్చితంగా 16 నుంచి 17 అసెంబ్లీ స్థానాలలో విజయం సాధించబోతున్నాం అన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనానికి కనిష్టంగా 30,000... గరిష్టంగా 50 వేల ఓట్ల వరకు మెజార్టీ వస్తుందని జనసేన పార్టీ నేతలు అంచనాలు వేసుకుంటున్నారు. పిఠాపురం నుంచి వచ్చే మెజార్టీతోనే కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ కూడా విజయం సాధించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక మచిలీపట్నంలో జనసేన ఎంపీ అభ్యర్థి బాలశూరి భారీ మెజార్టీతో గెలవబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: