- ప్లేస్ మారినా.. పార్టీ మారినా ఓట‌మి లేని హీరో ర‌వి
- నేటి త‌రం రాజ‌కీయాల్లో ఓ రోల్ మోడ‌ల్ నేత‌
- కాంగ్రెస్‌, వైసీపీ, టీడీపీ మూడు పార్టీల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌..!

( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )

గొట్టిపాటి రవికుమార్ ఈ పేరు తెలుగు రాజకీయాల్లో ఒక సెన్సేషన్. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చిన గొట్టిపాటి రవికుమార్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రద్దయిన మార్టూరు నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నియోజకవర్గాల‌ పునర్విభజనలో మార్టూరు రద్దవడంతో 2009లో అద్దంకికి మారిన రవికుమార్ ఆ ఎన్నికలలో టిడిపి నుంచి కాకలు తీరిన రాజ‌కీయ యోధుడు అయిన‌ కరణం బలరాంను ఓడించారు. 2014లో అదే అద్దంకి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన రవికుమార్ 2019 ఎన్నికలలో అద్దంకి నుంచి వరుసగా నాలుగోసారి విజయం సాధించారు.


మార్టూరు - అద్దంకి రెండు నియోజకవర్గాలు మారినా కాంగ్రెస్, వైసిపి, తెలుగుదేశం మూడు పార్టీలు మారినా ఓటమి అనేది రవికుమార్ చరిత్రలోనే లేదు. అటువైపు ఎంత మంది సీనియర్లు... యోదాన యోధులు అయిన నేతల పోటీ చేసినా గెలుపు మాత్రం రవికుమార్‌దే. రవికుమార్ అంటే మాస్ క్లాస్ కలబోసిన తిరుగులేని పొలిటికల్ లీడర్. రవికుమార్ పోటీ చేస్తున్నాడు అంటే ఏ పార్టీ అన్నది చూడరు.. అక్కడ రవికుమార్ అనేది ఒక పొలిటికల్ బ్రాండ్ అయిపోయింది. అంతలా రవికుమార్ ప్రజల మ‌న‌స్సుల్లోకి చొచ్చుకుపోయారు.


గొట్టిపాటి నరసయ్య - కరణం బలరాం - బాచిన చెంచు గర‌టయ్య - కరణం వెంకటేష్ లాంటి మంచి పొలిటికల్ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన నేతలను రవికుమార్ ఓడించారు. ఈ తరం రాజకీయాలలో గొట్టిపాటి రవి ఒక రోల్ మోడల్ నేత అయిపోయారు. 2014లో వైసీపీ నుంచి గెలిచి పార్టీ మారి టీడీపీలో పోటీ చేసిన అంద‌రు నేత‌లు ఓడిపోయారు. అయినా అద్దంకిలో మాత్రం ర‌వి గెలిచారు. జ‌గ‌న్‌కు ఇది ఎంత మాత్రం న‌చ్చ‌కే అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ర‌విని ఎంత టార్గెట్ చేసినా పార్టీ మార‌లేదు.


ఈ సారి జ‌గ‌న్ అద్దంకిలో త‌న సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాన్ లోక‌ల్ పాణెం హ‌నిమిరెడ్డిని ర‌విపై ప్ర‌యోగించారు. సేమ్ హ‌నిమిరెడ్డి కూడా ఎన్నిక‌ల‌కు ముందే చేతులు ఎత్తేసి .. ఒక్కోసారి ఫోన్లు సైతం స్విచ్ఛాఫ్ చేసుకుంటోన్న ప‌రిస్థితి. జ‌గ‌న్‌కు సైతం ర‌విని ఓడిస్తామ‌న్న ఆశ‌లు ఎప్పుడో పోయాయి. కానీ ఇక్క‌డ మెజార్టీ త‌గ్గితే బాప‌ట్ల పార్ల‌మెంటు సీటు కాపాడుకోవ‌చ్చ‌న్న చిన్న ఆశ మాత్ర‌మే ఉంది. ఈ ఎన్నిక‌ల్లో ర‌వి గెలుపు కాదు.. మెజార్టీ 30 + ఉంటుంద‌ని నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ నేత‌లు చెప్పుకుంటున్నారంటే ఇక్క‌డ వార్ ఎలా వ‌న్ సైడ్ అయిపోయిందో క్లీయ‌ర్‌గా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: