ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. ఇలాంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేలు పెట్టారు. తిరుమల శ్రీవారి సాక్షిగా... ఏపీ రాజకీయాలు అలాగే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో కొత్త ప్రభుత్వం రాబోతుందని... ఇన్ డైరెక్ట్ గా... కూటమికి అనుకూలంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇదే అంశం రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారింది.

మంగళవారం రాత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి... నేరుగా ఏపీకి వెళ్లారు. తన మనవడి తలనీలాలు తిరుమల శ్రీవారికి సమర్పించేందుకు... కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తిరుమల కొండ పైన ఉన్న ఎన్టీవీ న్యూస్ ఛానల్ అధినేత కూతురు రచన గారి ఆతిథ్య భవనంలో సేద తీరారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
అనంతరం ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి... ఏపీ రాజకీయాలపై స్పందించారు.

రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోవాలని.. పోటాపోటీగా ముందుకు వెళ్లాలని ఆయన తెలిపారు. అలాగే ఏపీలో కొత్త ప్రభుత్వం రాబోతుందని... ఆ ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తానని రేవంత్ రెడ్డి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏపీలో కొత్త ప్రభుత్వం అంటే... వైసిపి కాకుండా తెలుగుదేశం కూటమి రాబోతుందని రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పారని కొంతమంది అంటున్నారు.

చంద్రబాబు నాయుడు శిష్యుడిగా రేవంత్ రెడ్డికి పేరు ఉన్న సంగతి తెలిసిందే. అందుకే చంద్రబాబు నాయుడుకు సపోర్ట్ గా రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడారని అంటున్నారు. అలాగే తిరుమల కొండపైన తెలంగాణ ప్రభుత్వం తరఫున కళ్యాణ మండపం కూడా నిర్మిస్తామని... కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రక్రియ కొనసాగిస్తామని వెల్లడించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల టూర్ హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: