ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ముగిసి ఇప్పటికీ పది రోజులు పైనే కావస్తోంది. ఫలితాల కోసం నేతలు అందరూ కూడా చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. అయితే ఈసారి సైలెంట్ ఓటింగ్ జరగడంతో ఏ పార్టీ విజయం సాధిస్తుందనే విషయం పైన ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే గెలుపు పైన రెండు పార్టీలు సైతం చాలా ధీమానే తెలియజేస్తున్నారు. మరి కొంతమంది నేతలు మరో ముందడుగు వేసి సీఎం గా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహూర్తం తేదీలను కూడా ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ లండన్ లో పర్యటిస్తూ ఉన్నారు. చంద్రబాబు మాత్రం అమెరికాలో రిలాక్స్ అవుతున్నట్లు తెలుస్తోంది.


ఇదంతా ఇలా ఉంటే తాజాగా ఐపీఎల్ తో లింకు పెడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఫలితాల పైన కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. టిడిపిలో పసుపు రంగు ఉంటుంది కాబట్టి ఆ పార్టీకి చెందిన నాయకులు కూడా ఎక్కువగా వీటినే ధరిస్తూ ఉంటారు. ఐపీఎల్ లో కూడా అలాంటి దుస్తులు ధరించేది సీఎస్కే టీమ్ మాత్రమే. అయితే ఈ జెర్సీలకు టిడిపి శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వీరికి కౌంటర్ ఇస్తూ ఉంటుంది వైసీపీ.


2019 వైసీపీ ఘన విజయం సాధించింది ఆ సంవత్సరం ఐపీఎలలో సీఎస్కే ఫైనల్ లో ఓడిపోయారు. ఈ ఐపీఎల్ లో సీఎస్కే జట్టు ప్లే ఆఫ్ చేయరకుండానే వెనుతిరిగిపోయింది. దీంతో ఈ సారి జరిగే ఎన్నికలలో కూడా టిడిపి ఓడిపోతుందని వైసీపీ శ్రేణులు వైరల్ గా చేస్తున్నారు. ఇలా వీటి పైన కూడా ఇరువు వర్గాలు ఒకరి పైన మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు. మరి ఐపీఎల్ జాతకం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి అంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందే.. చివరికి ఐపీఎల్ కు, పొలిటికల్ కు కూడా లింకు పెట్టి మరి వైరల్ గా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: