ఈనెల 13వ తేదీతో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మాత్రమే మిగులు ఉంది ఇంకో రెండు వారాలు పాటు ఆగితే ఆ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. దానికంటే ముందు ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కొండ ప్రాంతమైన విజయవాడ వెస్ట్‌ నుంచి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. ఈ కొండ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ దుర్భర సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి పనులను చేపడతానని హామీ ఇస్తూ విజయవాడ వెస్ట్ ప్రాంత ప్రజలకు సుజనా చౌదరి ఎన్నికల ప్రచారం చేశారు.

నేను లోకల్ అంటూ, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని భరోసా ఇస్తూ ఆయన ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అనవసరంగా ఎక్కువ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టే పని తాను ఎప్పటికీ చేయనని చేయగలిగిన పనుల గురించి చెప్పి వాటిని కచ్చితంగా చేతల్లో చూపిస్తానని అన్నారు. ఇక్కడ ప్రజలు రోడ్ల వంటి మాలిక సదుపాయాలు లేక చాలా ఇక్కట్లు పడుతున్నారు. తనని గెలిపిస్తే ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు చేరువయ్యారు.

మరోవైపు విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ ఎమ్మెల్యే షేక్ అసిఫ్ పాటిస్పేట్ చేస్తున్నారు. మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరితో పోటీపడుతున్న ఈయన గెలుపు పై నీలి నీడలు కమ్ముకున్నాయి. యలమంచిలి సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరిని ఎదుర్కోవడం కాస్త కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఆయన చాలా కాలంగా  పాపులర్ పొలిటిషన్‌గా రాణిస్తున్నారు. రాజ్యసభలో పార్లమెంటు సభ్యునిగా కూడా పనిచేశారు.  మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. 2014 నవంబర్ 9 నుంచి 2018, మార్చి 8 వరకు, అతను సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు హైదరాబాద్‌లోని సుజనా గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌కు నేతృత్వం వహించారు. అందుకే ఆయనకు సుజనా చౌదరి అనే పేరు వచ్చింది.

 ప్రజలు సుజనా చౌదరిని నమ్మి అక్కడి నుంచి ఆయనను గెలిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 4వ తేదీన మాత్రమే ఎవరు గెలుస్తారనేది తెలుస్తుంది అప్పటిదాకా ఈ నియోజకవర్గం గెలుపు మిస్టరీ గానే ఉంటుందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP