ఆంధ్రజ్యోతి పేపర్ చంద్రబాబుకి అనుకూలంగా వార్తలు రాస్తుందని సంగతి అందరికీ తెలిసిందే. ఈ సంగతి నీ పక్కన పెడితే ఆ పేపర్ కవర్ చేస్తే కొన్ని స్టోరీలు చాలా బాగుంటాయి. ఏ పేపరు కూడా చేయని ధైర్యంతో ఈ పేపర్ కొందరి బాగోతాలను బయటపెడుతుంది. ఏ తెలుగు పేపర్ కూడా టచ్ చేయని సెన్సిటివ్ టాపిక్స్ ను టచ్ చేస్తుంది. తాజాగా ఫ్యాక్షన్ పల్లెల గురించి ఈ పేపర్ ఒక కథనం రాసింది. "బలైన బలగం" పేరిట ఈ న్యూస్ పేపర్ ప్రచురించిన ఒక ఆర్టికల్ చదివి చాలామంది శభాష్ ఆంధ్రజ్యోతి అంటూ కితాబిస్తున్నారు.

 ఏబీఎన్ నేడు పల్నాడులోని జూలకల్లు నీ గురించి రాసింది. 35 ఏళ్ల క్రితం ఎంతో ఫ్రెండ్లీగా ఉన్న ఊరి ప్రజలు ఒక చిన్న గొడవ వల్ల ఎలా శత్రువులుగా మారారు రాసుకొచ్చింది. రాజకీయ గొడవలకు స్వర్గం లాంటి ఈ ఊరు ఒక నరకం లాగా తయారయ్యిందని తెలిపింది. హత్యలు, అల్లర్లతో గ్రామస్థులు జైలుకు వెళ్తే మహిళలు కూలీలుగా మారాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొంది. ఈ గొడవల వల్ల ఒక తరం ప్రజల జీవితాలు దుర్భరమయ్యాయి అని చెప్పుకొచ్చింది.

 ఆ కథనం హైలెట్ చేసిన విషయాలు తెలుసుకుంటే, పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు సంస్థలు అప్పటి గొడవలు తలుచుకుంటే ఇప్పటికీ భయపడతారు. ఐదువేల మంది జనాభా ఉన్న ఈ చిన్న పల్లెటూరు 35 ఏళ్ల క్రితమే చాలా అభివృద్ధి చెందింది. అందరూ ఆప్తులుగా ఉంటూ ఒకరికొకరు సహాయం చేసుకునే వారు, అందరూ చదువుకున్న వారే. పాడిపంటలతో, అష్ట ఐశ్వర్యాలతో అందరూ హాయిగా జీవించేవారు. కానీ ఎన్నికల సమయంలో జరిగిన ఒక చిన్న గొడవ కులాల మధ్య చిచ్చు పెట్టింది. తర్వాత అది ఫ్యాక్షనిజంగా రూపాంతరం చెందింది. దీనివల్ల చాలామంది మహిళలు భర్తలను కోల్పోయి రోడ్డున పడ్డారు. మగవారి ఎక్కువగా చనిపోవడం, జైలు పాలు కావడం వల్ల పంట పండించేవారు కరువయ్యారు. తినడానికి తిండి లేక భూస్వాములు కూడా కూలీ పనులకు వెళ్లాల్సి వచ్చింది.

 అయితే ఇప్పుడు పల్నాడులో జరుగుతున్న గొడవలను చూస్తుంటే అప్పటి జూలకల్లు రావణకాష్టం కళ్ళ ముందు మెదులుతోంది. ఇదే విషయాన్ని ఆంధ్రజ్యోతి హైలెట్ చేసింది. ఇలాంటి విషాదకరమైన స్టోరీలు చెబుతూనే మళ్ళీ ప్రజలు గొడవలు పడి అప్పటి పరిస్థితి తెచ్చుకోవద్దని సున్నితంగా అందరినీ హెచ్చరించింది. ప్రజలు కొట్టుకోవద్దని చెప్పడానికి ఏబీఎన్ రాసిన ఈ కథనం అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. వైసీపీ వాళ్లు కూడా ఆంధ్రజ్యోతి తెగ పొగిడేస్తున్నారు. ఇలాంటి కథనాలు ఇంకా రాయాలని ప్రోత్సహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: