సాక్షి మీడియా జగన్‌కు అనుకూలంగా, టీడీపీకి వ్యతిరేకంగా కథనాలను ప్రచురిస్తుంటుంది. అంతేకాదు వైసీపీ గురించి టీడీపీ చేసే దుష్ప్రచారాలను, ఫేక్ వార్తలను ఎండగడుతుంది. టీడీపీ అక్రమాలను కూడా బయటపెడుతుంది. నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. తాజాగా కూడా టీడీపీ వాళ్ళు చేసిన అరాచకాలకు ఆనవాళ్లు ఇవిగో అంటూ సాక్షి ఒక వార్త రాసింది. పల్నాడు జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఊరి నుంచి పారిపోయి వేరే చోట దాక్కుని ఉంటున్నారని ఇదంతా టి.డి.పి వాళ్ల రౌడీయిజం వల్లే అని సాక్షి ఆరోపించింది. సాక్షి కథనం ప్రకారం, బడుగు, బలహీన వర్గాల ప్రజలు వైసీపీ వాళ్ళకి ఓటు వేశారనే అనుమానంతో వారిపై అటాక్స్ చేస్తున్నారు. పోలింగ్ తర్వాత కూడా ఈ దాడులు కొనసాగుతూ ఉండటం ఆందోళనలను రేకెత్తిస్తోంది.

 కారంపూడి మండలం పేటసన్నెగండ్లలో బేడ బుడగ జంగాలపై, అలాగే రెండు చింతల మండలంలోని గొలీ గ్రామంలోని ఎస్టీలపై కూడా టీడీపీ నేతలు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారని సాక్షి మీడియా ఆరోపించింది. చిలకలూరిపేట, గణేశుని పాడు ప్రాంతాల్లోని బడుగు, బలహీన వర్గాలపై అటాక్స్ జరిగాయని సాక్షి రాస్కొచ్చింది. బాధితులు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తే వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారట. మే 13 నా పోలింగ్ తేదీ ఈ రోజున క్యూ లైన్‌లో నిల్చున్న ఎస్సీ, ఎస్టీ మహిళలను తన్ని తరిమేసి వారి స్థానంలో టీడీపీ వాళ్ళు రిగ్గింగ్ చేశారట. దళితులకు ఓటు వేసే హక్కు లేదన్నట్లు మదంతో రెచ్చిపోయారట. సాక్షి ప్రకారం పాలువాయిగేటు గ్రామంలోని పోల్ బూత్ 201, 202 నెంబర్స్‌లో ఓట్లు వేయకుండా టిడిపి వాళ్ళు అడ్డుకున్నారు.

 అయితే ఇదంతా చదివిన తర్వాత చాలామంది సాక్షిని తిడుతున్నారు. ఇలాంటివి రాసుకోవడానికి సిగ్గు ఉండాలి అంటూ ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వైసీపీ వాళ్ల చేతిలోనే ఉంది. మొత్తం ఎన్నికల సంఘమే చూసుకుంటుందని ఎప్పుడూ అనుకోకూడదు ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. స్థానిక ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళదే.

ప్రజలు ఊరి బయట దాచుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? వారిని ఊర్లోకి తీసుకొచ్చే ధైర్యం వైసీపీ నాయకులు ఎందుకు చేయడం లేదు? వీరి ఆస మద్దతు కారణంగానేనా? ఇప్పటికీ అలాంటి పరిస్థితి ఉంది అని చెప్పుకోవడానికి వైసిపి వాళ్ళకి సిగ్గు లేదా అని ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉండి తమ వాళ్లని కూడా కాపాడుకోలేని వాళ్లు ఉండి ఎందుకు అని విమర్శిస్తున్నారు. టీడీపీ గుండాలు యథేచ్ఛగా రెచ్చిపోతుంటే వైసీపీ నేతలు అందరూ ఎందుకు సైలెంట్ గా అయిపోయారు అని నిలదీస్తున్నారు కోర్టుల సహాయం తీసుకున్న అయిపోతుందిగా సలహా ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: