•వైఎస్సార్ నుంచి జగన్ దాకా తలశిలకు ఉన్న బంధం వెలకట్టలేనిది

•జ‌గ‌న్ ప్రచార వ్యూహంలో కీల‌క పాత్ర పోషించిన తలశిల


సీనియ‌ర్ నాయ‌కుడు.. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాకు చెందిన త‌ల‌శిల ర‌ఘురామ్‌.. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. గ‌తంలో ఈయ‌న‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌ని అనుకున్నా.. సాధ్యం కాలేదు. దీంతో ఎమ్మెల్సీగా అవ‌కా శం క‌ల్పించారు. దీంతో పాటు.. సీఎం జ‌గ‌న్ ప్రచార కార్య‌క్ర‌మాల‌కు వ్యూహ‌క‌ర్త‌గా.. స‌ల‌హాదారుగా కూడా త‌ల‌శిల వ్య‌వ‌హ‌రించారు. ఎక్క‌డా కూడా ఆయ‌న ఫెయిల్ కాకుండా.. ఆయ‌న కార్య‌క్ర‌మాల‌ను రూపొందించ‌డంలోనూ... సీఎం జ‌గ‌న్ ప్ర‌చారాన్ని ముందుకు తీసుకువెళ్ల‌డంలోనూ స‌క్సెస్ అయ్యారు.


పార్టీ అదికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వైసీపీ మీడియా కోఆర్డినేట‌ర్‌గా.. ఉన్న‌త‌ల‌శిల ర‌ఘురామ్‌కు.. 2021-22 మ‌ద్య కాలంలో సీఎం జ‌గ‌న్ స‌ల‌హాదారు ప‌దవితోపాటు.. ఎమ్మెల్సీ సీటును కూడా ఇచ్చారు. జ‌గ‌న్ ప్ర‌చారాలతోపాటు. జిల్లాల్లో ఆయ‌న ముఖ్య‌మంత్రిగా ప‌ర్య‌ట‌న‌లు చేసిన‌ప్పుడు.. ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి.. ఎలాంటి అంశాల‌పై మాట్లాడాలి? అనే విష‌యాల‌పై త‌లశిల సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చార‌ని అంటారు. అంతేకాదు.. సీఎం జ‌గ‌న్ ప‌ర్య‌ట‌లో ప‌ర‌దాలు క‌ట్ట‌డం వెనుక కూడా.. త‌ల‌శిల సూచ‌న‌లు ఉన్నాయ‌ని చెబుతారు.


సీఎం జ‌గ‌న్‌పై కొన్ని వ‌ర్గాల్లో వ్య‌తిరేక‌త‌ను ప్ర‌తిప‌క్షాలు పెంచి పోషించాయని.. అందుకే.. ఆయ‌న‌పై ప‌ర్య‌ట‌న‌ల్లో ప్ర‌మాదాలు జ‌రిగే అవకాశం ఉంద‌ని.. త‌ల‌శిల భావించారు. ఈ క్ర‌మంలోనే పర‌దాల అంశాన్ని తీసుకువ‌చ్చారు. వాస్త‌వానికి సోనియ‌గాంధీ గ‌తంలో ఏపీలో ప‌ర్యటించిన‌ప్పుడు కూడా..ఇలానే ప‌ర‌దాలు క‌ట్టేవారు. ఈ ఆలోచ‌న‌ను కూడా..  వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఇచ్చింది త‌ల‌శిలే అని అంటారు. ప్ర‌చారం ఎంత ముఖ్య‌మో.. నాయ‌కుల‌ను కాపాడుకోవ‌డం కూడా అంతే ముఖ్య‌మని ర‌ఘురామ్ ఆలోచ‌న‌.


ప్ర‌చారానికి తాను దూరంగా.. కేవ‌లం వ్యూహాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన త‌ల‌శిల‌.. ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలోనూ.. సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ నిద్ర చేయాలి.? ఎంత దూరానికి విశ్రాంతి తీసుకోవాలి? ఏయే అం శాల‌ను ప్ర‌స్తావించాల‌నే విష‌యాల‌పై.. ఐప్యాక్ టీంతో స‌మ‌న్వ‌యం చేసుకున్నారు త‌ల‌శిల‌. అందుకే.. ఎన్నికల ప్ర‌చారంలో ఇత‌ర పార్టీల క‌న్నా కూడా.. సీఎం జ‌గ‌న్ చాలా ముందున్నారు. అదేవిధంగా ప్ర‌చార పాట‌ల రూప‌క‌ల్ప‌న నుంచి.. వాటిని సోష‌ల్ మీడియాలో ప్రొజెక్టు చేసేవ ర‌కు కూడా.. త‌ల‌శిల అనేక స‌ల‌హాలు ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. వైఎస్ కుటుంబంలో తండ్రి నుంచి త‌న‌యుడివ‌ర‌కు.. స‌ల‌హాదారుగా వ్య‌వ‌హ‌రించిన ఘ‌న‌త త‌ల‌శిల‌కే ద‌క్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: