జోష్యం చెబుతున్నారా ఏమిటి? అని అనుకోవద్దు. ఇది కొంతమంది విశ్లేషకుల భావన మాత్రమే. అవును, మీ లాజిక్ కి అందే విశ్లేషణగానే దీన్ని పరిగణించవచ్చు. రోజులు చాలా మారాయి. ఇక్కడ ఏ ఒక్క పార్టీ కూడా మునిపటిలా ఓటర్లను మభ్యపెట్టే రాజకీయాలు చేయడం ఇపుడు ఒకింత కష్టం. జనాలు ఇపుడు చాలా క్లారిటీతో ఉంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ అనే రెండు పార్టీలే ఉన్నాయి కాబట్టి వేరే చర్చ అవసరం లేదు. ఈ రెండింటిలో ఒక పార్టీ మాత్రమే విజయాన్ని చేజిక్కించుకుంటుంది. అది నిర్వివాదాంశం. ఇక ఇపుడు గెలిచిన పార్టీకి... 2024, 2029 మధ్యలో అన్నీ సానుకూల అంశాలే ఉంటాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

విషయం ఏమిటంటే, రాష్ట్రం ఏర్పడ్డ తరువాత తొలి పదేళ్లు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోంది రాష్ట్రం. తదుపరి ఒక స్పష్టమైన లక్ష్యం దిశగా ఏపీ సాగే కీలక కాలం మున్ముందుంది. అందుకే ఎవరు అధికారంలోకి వచ్చినా ఇకనుండి తప్పకుండా అభివృద్ధి జరిగి తీరుతుంది అని అంటున్నారు. అదేవిధంగా సంపద కూడా పెరుగుతుంది. దాంతో సీఎం గా ఉన్న వారికి చాలా కష్టాలు తప్పి గతంలో ఎన్నడూ లేని విధంగా పేరు ప్రఖ్యాతులు వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. అయితే రానున్న అయిదేళ్లలో జరిగేది ఏంటి? అన్నది తీసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ గ్యారంటీగా పూర్తయి పోతుంది అని అంటున్నారు. ఇంకేముంది, కట్ చేస్తే... ఆ క్రెడిట్ అధికారంలో ఉన్న పార్టీకి సీఎంకే నేరుగా దక్కుతుంది.

అలా జరిగితే ఆ రాజకీయ ప్రభావం దాదాపు అయిదారు జిల్లాల మీద ప్రభావం చూపుతుంది. దాంతో అది ఒక పెద్ద ఓటు బ్యాంక్ గా ఆ పార్టీకి 2029 ఎన్నికల్లో సహాయపడుతుంది. అదేవిధంగా రాజధాని సమస్య కూడా ఒక కొలిక్కి వచ్చి తీరుతుంది. వైసీపీ గెలిస్తే విశాఖను పాలనా రాజధానిగా చేసుకుని పాలిస్తుంది. టీడీపీ అధికారంలోకి వస్తే అమరావతినే రాజధానిగా ప్రకటించి తన వంతుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తుంది. ఇక విభజన హామీలు పదేళ్ళలో పెద్దగా అమలు కాలేదు. రానున్న అయిదేళ్ల కాలంలో అవి పూర్తి స్థాయిలో అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. ఉమ్మడి ఆస్తుల విభజన, అదే విధంగా ఏపీకి రావాల్సిన నిధులు అన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది అని సమాచారం. ఈ రకంగా మొత్తానికి ఏది ఏమైనా 24లో గెలిచిన పార్టీనే 29లో కూడా అధికారంలోకొస్తుంది అనడానికి ఇవే పెద్ద ఉదాహరణలు అని చెప్పుకోవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: