బీజేపీ అధిష్టానం జగన్ గెలవబోతున్నారు అని బలంగా నమ్ముతుందట. ఈసారి మళ్లీ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం అని వారు కొన్ని లెక్కలు చేయడం ద్వారా తుది అంచనాకు వచ్చారని విశ్వసనీయవర్గాల సమాచారం. కమ్యూనిస్టు ఐడియాలజిస్ట్ రవికాంత్ ఈ విషయాలను బయటపెట్టారు. జగన్ కలబోతున్నారని తెలిసింది కాబట్టే ఇప్పుడు ఆయనకు బీజేపీ దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. నిజానికి బీజేపీకి, వైసీపీకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఎలాంటి విభేదాలు లేవు కాబట్టి జగన్ గెలిస్తే బిజెపి వెంటనే జగన్ పక్షాన చేరే అవకాశం ఉంది
 
15 నుంచి 20 దాక ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంటే జగన్ బీజేపీని తన చెప్పు చేతల్లో పెట్టుకోవచ్చు. టీడీపీ పొత్తు నుంచి బయటికి రావాలని డిమాండ్ చేయవచ్చు. రాజ్యసభ సీట్లు కూడా చాలా కీలకంగా మారవచ్చు. టు హౌసెస్ లో మోదీ మాత్రమే జగన్ సహాయం తప్పనిసరిగా అవసరం అవుతుంది. కాబట్టి జగన్ కోరినట్లు చంద్రబాబు, టీడీపీని మోదీ దూరంగా పెట్టవచ్చు. మరోవైపు టీడీపీ గెలిస్తే జగన్ కి అన్ని వైపుల నుంచి తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుంది.

బీజేపీ వైసీపీ పార్టీ గెలుస్తారని చివరి రోజుల్లో ఒక అంచనాకు రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. చంద్రబాబుతో మోడీ కలవడం ఒక పెద్ద వింత అయింది. ఎందుకంటే గతంలో చంద్రబాబు మోదీని ఏపీలో అడుగుపెట్టనివ్వలేదు. కాంగ్రెస్ తో కలిసి చెట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. మోదీని కారణంగా విమర్శించారు. రాజకీయ విశ్లేషకులు ముందు నుంచి చంద్రబాబు గెలవరని, పవన్ కళ్యాణ్ వట్టి తోలుబొమ్మ అని చెబుతూ వస్తున్నారు. వాడితో కలవడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదని ఎవరు ఎంత మొత్తుకున్నా బీజేపీ మాత్రం టీడీపీ, జనసేనలతో చేతులు కలిపింది.

చంద్రబాబును మోదీ నామినేషన్ ఈవెంట్ కి కూడా పిలిచారు. పెద్దలతో కూర్చోబెట్టిది తనకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తుంటే మొన్నటిదాకా వారు అనుభవజ్ఞుడు చంద్రబాబు ఈసారి తప్పకుండా గెలుస్తాడని అనుకొని ఉంటారని తెలుస్తోంది. వైసిపి మాత్రం తక్కువ ఓట్లతో ఓడిపోతుందని అంచనా వేసి ఉంటారు. జగన్ ను వాళ్లు మరీ అంత చులకనగా అంచనా వేయడమే ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: