ఏపీలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి దాని తర్వాత సీఎం జగన్ లండన్ కి వెళ్ళిపోయారు మరోవైపు చంద్రబాబు చడీ చప్పుడు చేయకుండా అమెరికాకి చెక్కేశారు ఇక పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికీ తెలియదు. ఐక్యరాజ్యసమితికి సంబంధించి ఏదో కార్యక్రమంలో పవన్ పాల్గొనడానికి వెళ్లారని కొంతమంది చెబుతున్నారు. కానీ కచ్చితంగా ఆయన ఎక్కడున్నారు అనేది ప్రస్తుతానికైతే మిస్టరీగానే మిగిలింది. అయితే ఏపీ ఎన్నికల సమయంలో వీరి ముగ్గురితో పాటు దగ్గుబాటి పురందేశ్వరి కూడా బాగా హైలెట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆమె కూడా ఏపీ కనిపించకుండా పోయారు. మొదట తమిళనాడు వెళ్లారు. ఆపై చెన్నై, అనంతరం అరుణాచల్ ప్రదేశ్ వెళ్లినట్లు తెలిసింది.

 అరుణాచల్ ప్రదేశ్ లో ఒక గుడి దగ్గర దేవుడిని దర్శనం చేసుకుని బయటికి వచ్చినట్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇలా దేవుడిని సందర్శించుకున్న తర్వాత ఆమె ఒడిశాకు బీజేపీ స్టార్ క్యాంపెనర్‌గా వెళ్లారు. అక్కడ ఎన్నికల ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. ఇదంతా బాగుంది కానీ రాజమండ్రి నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసింది అక్కడ గెలిచే పరిస్థితి ఉందా? రాజమండ్రిలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే టీడీపీ ఆరు గెలవబోతుందని అంటున్నారు. ఆ ఓట్లన్నీ కూడా పురందేశ్వరికే పడినట్లు టీడీపీ వాళ్లు ధీమాగా చెబుతున్నారు. పురందేశ్వరి కూడా తన గెలుపు ఖాయం అనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

 అయితే రాజమండ్రిలో ఒక కోటికి మాత్రమే డబ్బులు ఇచ్చారట ఎంపీ లేదా ఎమ్మెల్యే కానీ ఎంపీ ఎమ్మెల్యే రెండిటికి డబ్బులు ఇవ్వలేదట. దీనివల్ల ఓటర్లలో కొంత అసంతృప్తి వ్యక్తమైనట్లు తెలిసింది. అయితే ఎన్నికల గుర్తు విషయాన్నీ కూడా ఓటర్లు కన్ఫ్యూజ్ అయ్యారట. కొందరు కమలం గుర్తు పువ్వు అనుకుంటే మరికొంతమంది గ్లాసు అని అనుకున్నారట. ముఖ్యంగా పెద్దగా చదువుకోలేని వారు ఏ గుర్తుకు ఓటు వేయాలో తెలియక గందరగోళంలో పడిపోయారని, పురందేశ్వరికి మాత్రం ఓటు వేయలేదని టాక్ నడిచింది. మొత్తం మీద ఆమె ఓటమి ఖాయమని వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు. టీడీపీ వాళ్ళు చేసిన తప్పులు వల్లే పురందేశ్వరి ఓడిపోబోతున్నారని అంటున్నారు. టీడీపీలో కలవడం వల్ల ఆమె పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారయ్యిందని ఎద్దేవా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: