- బోధ‌న వృత్తి నుంచి ఎమ్మెల్సీ
- నిష్ప‌క్ష‌పాత విశ్లేష‌ణ‌ల‌కు మారుపేరు
- వైసీపీ ఫేవ‌ర్ ఎన‌లిస్ట్‌ అంటూ టీడీపీ కౌంట‌ర్‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )


రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాపుల‌ర్ అయిన‌.. ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ గురించి.. అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ప్ర‌ముఖ విశ్లేష‌కులుగానే కాకుండా.. రాజ‌కీయ ఫ‌లితాల‌ను కూడా అంచ‌నా వేయ‌డంలో దిట్ట‌గానే పేరొం దారు. వాస్త‌వానికి ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా.. ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు ఓడిపోతార‌నే అంచ‌నాలు అంద‌రూ వేస్తుంటారు. కానీ, ఏవి విశ్వ‌స‌నీయం.. ఏవి కాదు..? అనేది మాత్రం చెప్ప‌డం కొంత క‌ష్ట‌మే. కానీ, ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ విష‌యంలో కొంత పార‌ద‌ర్శ‌కత ఉంటుంద‌ని అంటారు.


సుదీర్ఘ కాలంగా.. బోధ‌న వృత్తిలో ఉన్న ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్‌.. గ్రాడ్యుయేట్ కోటాలో ఎమ్మెల్సీగా కూడా చేశా రు. త‌ర్వాత నేరుగా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ.. విశ్లేష‌ణ‌లు, చ‌ర్చ‌లు వంటివాటిలో పాల్గొం టున్నారు. రాజ‌కీయ పార్టీల వ్య‌వ‌హార శైలి.. ఆయా పార్టీల నాయ‌కులు అనుస‌రిస్తున్న విధానాలు.. ప‌థ‌కా లు, సంక్షేమం, ఆదాయం, పార్టీల తీరుతెన్నులు.. ఇలా అనేక రూపాల్లో లోతైన విశ్లేష‌ణ‌లు చేయ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌ను చైత‌న్య ప‌రిచే క్ర‌మంలో నాగేశ్వ‌ర్ ముందున్నార‌నే చెప్పాలి.


తాజాగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల‌పైనా నాగేశ్వ‌ర్ విశ్లేష‌ణ చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం నుంచి సంక్షేమ ప‌థ‌కాలు అందుకున్న వారు ఆ పార్టీకి మ‌ద్ద‌తుగా వోటేశార‌ని చెప్పిన ఆయ‌న‌.. ఇదే స‌మ‌యంలో చెత్త‌పై ప‌న్ను.. విద్యుత్ చార్జీలు.. రాజ‌ధాని లేక‌పోవ‌డం..ఉద్యోగాల క‌ల్ప‌న లేక‌పోవ‌డం...మెగా డీఎస్సీ వేస్తామ‌ని చెప్పి కూడా వేయ‌క‌పోవ‌డం వంటివి ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన ఆగ్ర‌హాన్ని క‌లిగించాయ‌ని చెప్పారు. అలాగ‌ని పూర్తిగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేకత లేద‌న్నారు. ఏక‌ప‌క్షంగా అయితే ఎన్నిక‌లు జ‌ర‌గలేద‌ని తేల్చి చెప్పారు.


ఇక‌, ప‌వ‌న్ ఎంట్రీతో రాజ‌కీయ ముఖ చిత్రం మారిపోయింద‌ని.. కూట‌మికి బ‌లం ప‌వ‌నేన‌ని విశ్లేషించారు. ప‌వ‌న్ క‌నుక కూట‌మిని ఏర్పాటు చేయ‌డంలో కీల‌క రోల్ పోషించి ఉండ‌క‌పోతే..ఏపీలో ఏక‌ప‌క్షంగానే ఎన్నిక‌లు జ‌రిగిపోయి ఉండేవ‌ని ప్రొఫెస‌ర్ చెప్పుకొచ్చారు. మొత్తానికి ఫైట్ మాత్రం ట‌ఫ్‌గానే ఉంద‌న్న ఆయ‌న‌.. త‌నంత‌ట తానుగా మాత్రం.. ఏ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంటుంద‌నేది ఇప్పుడే చెప్ప‌బోన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.


అయితే.. వైసీపీకి ప‌ది ప్ల‌స్‌లు ఉంటే.. 12 వ‌ర‌కు మైన‌స్‌లు ఉన్నాయ‌ని, ఇక‌, కూట‌మి ప‌క్షాన బీజేపీతో క‌ల‌వ‌డం ద్వారా.. మైనారిటీ , ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు చీలిపోతుంద‌న్న‌ది ప్రొఫెస‌ర్‌విశ్లేష‌ణ‌. గ‌తంలో ఈయ‌న చెప్పిన విష‌యాలు.. ప్ర‌భుత్వ పార్టీల‌తో ఎలాంటి సంబంధం లేక‌పోవ‌డం వంటివి ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ విశ్లేష‌ణ‌ల‌కు విశ్వ‌స‌నీయ‌త పెంచాయ‌ని చెప్ప‌డంలో సందేహం లేదు. అయితే ఈ సారి మాత్రం ఆయ‌న వైసీపీ ప‌క్షానే ఏక‌ప‌క్షంగా నిలుస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు టీడీపీ, జ‌న‌సేన సింపైతైజ‌ర్స్ నుంచి వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: