- ప్ర‌జాశ‌క్తి ఎడిట‌ర్‌గా.. క‌మ్యూనిస్టు వాదిగా మంచి గుర్తింపు
- తెలంగాణలో కేసీఆర్‌కు, ఏపీలో జ‌గ‌న్‌కు అనుకూల‌మ‌ని కామెంట్లు..?
- జ‌గ‌న్ స‌ర్కార్ ఇచ్చిన వైఎస్సార్ లైఫ్ ఎచీవ్‌మెంటు అవార్డు తిర‌స్క‌ర‌ణ‌

( విశాఖ‌ప‌ట్నం - ఇండియా హెరాల్డ్ )

తెల‌క‌ప‌ల్లి ర‌వి. ప్ర‌ముఖ రాజ‌కీయ విశ్లేష‌కులుగా పేరు తెచ్చుకున్నారు. మూడు ద‌శాబ్దాల‌కు పైగా ఆయ‌న పాత్రికేయ రంగంలో ఉన్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌జాశ‌క్తి దిన‌ప‌త్రిక‌.. ఎడిట‌ర్‌గా కూడా చేశారు. అనంత రం.. వ్యాస‌క‌ర్త‌గా ప‌లు ప‌త్రిక‌ల్లో వ్యాసాలు విశ్లేష‌ణ‌లు రాసి.. అంద‌రినీ ఆక‌ర్షించార‌. ఒక ప్ర‌త్యేక పాఠ‌క వ‌ర్గాన్ని స‌ముపార్జించుకున్నారు. ప్ర‌ముఖ ప‌త్రిక‌ల‌లో రాసిన వ్యాసాలు.. విశ్లేష‌ణాత్మ‌కంగా సాగ‌డంతో పాఠ‌కుల‌ను ఆయ‌న ఆక‌ర్షించారు.


ఆది నుంచి కూడా క‌మ్యూనిస్టు మ‌నోభావాల‌తో పాత్రికేయ రంగంలో త‌న‌కంటూ గుర్తింపు తెచ్చుకున్న తెల‌క‌ప‌ల్లి ర‌వి.. త‌ర్వాత కాలంలో పూర్తిస్థాయిలో రాజ‌కీయ విశ్లేష‌కులుగా మారారు. అయితే.. ఈయ‌న విష‌యంలో ఒకింత సందిగ్ధ‌త ఉంది. జాతీయ రాజ‌కీయాల వ‌ర‌కు వ‌స్తే.. క‌మ్యూనిస్టుల‌కు బ‌ద్ధ శ‌త్రువైన‌.. బీజేపీని దునుమాడ‌డంలో ఈయ‌న కీల‌క రోల్ పోషించార‌నే చెప్పాలి. లోతైన విశ్లేష‌ణ‌లు, ప్ర‌ధాని మోడీ తీసుకున్న నిర్ణ‌యాల్లో లోపాల‌ను ఎండ‌గ‌ట్టారు.


ఇదే స‌మ‌యంలో రాష్ట్రాల‌కు వ‌చ్చేసరికి .. గ‌త ఏడాది తెలంగాణ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు అప్ప‌టి సీఎం కేసీఆర్‌కు కొంత అనుకూలంగా విశ్లేష‌ణ‌లు ఇచ్చారు. దీంతోవిమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. బీఆర్ ఎస్‌కు వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ.. కాంగ్రెస్‌లో అనైక్య‌త కార‌ణంగా ఆయ‌న విజ‌యం ద‌క్కించుకుంటార‌నే విష‌యా న్ని ఆయ‌న ప‌లు సంద‌ర్భాల్లో చెప్పారు. ఇది రాజ‌కీయ వ‌ర్గాల్లోఆగ్ర‌హానికికార‌ణ‌మైంది. చివ‌ర‌కు.. ర‌వి.. తాను త‌ట‌స్థుడిన‌ని చెప్పుకొనే ప‌రిస్థితి వ‌చ్చింది.


ప్ర‌స్తుతం ఏపీ ఎన్నిక‌ల‌పైనా ర‌వి విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. అయితే.. ఇక్క‌డ కూడా ఒకింత ఏక‌ప‌క్షంగానే ఆయ‌న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. గ‌తంలో వైఎస్సార్ లైఫ్ ఎచీవ్‌మెంటు అవార్డుకు జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. ర‌విని ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే. దీని కింద రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దును కూడా ప్ర‌క‌టించారు. దీనిపై ముందు ఏమీ చెప్ప‌ని ఆయ‌న త‌ర్వాత‌.. విమ‌ర్శ‌లు రావ‌డంతో ఈ అవార్డును తిర‌స్క‌రించారు. కానీ, అప్ప‌టి నుంచి వైసీపీ విష‌యంలో త‌ట‌స్థంగా కొంత సేపు.. అనుకూలంగా మ‌రికొంత సేపు వ్య‌వ‌హ‌రించారు.


ఈ ప‌రిణామం.. ప్ర‌స్తుత ఎన్నిక‌ల విశ్లేష‌ణ‌పైనా ప‌డుతోంది. ప్ర‌ధానంగా ఎన్డీయే కూట‌మి లోపాల‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నారు. వీటిని లోతుగా విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. వైసీపీ గెలుపు గుర్రం ఎక్కుతుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో తెల‌క‌ప‌ల్లి ర‌వి అంచ‌నాలు, విశ్లేష‌ణ‌లు ఒకింత ఏక‌ప‌క్షంగా ఉన్నాయ‌ని ప‌లువురు వ్యాఖ్యానించడం గ‌మ‌నార్హం. విశ్లేష‌ణ‌ల‌ను వ్య‌తిరేకించే వారు లేక‌పోయినా.. ఆయ‌న లైన్ మాత్రం ఒకింత ఇబ్బందిగానే ఉంద‌నేటాక్ వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: