- టీడీపీ నుంచి గెలిచిన ఏకైక ఎస్సీ ఎమ్మెల్యే
- జ‌గ‌న్ స‌ర్కార్ అరాచ‌కాలు ఎదిరించి నిలిచిన నేత‌
- బాబు కోసం... బాబుతోనే అంటోన్న స్వామి

( ప్ర‌కాశం - ఇండియా హెరాల్డ్ )

డోల బాల శ్రీ వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీలో ఒక సెన్సేషన్‌. తెలుగుదేశం పార్టీలో ఎవరికీ లేని ఏకైక రికార్డు స్వామి సొంతం. ఆ స్వామి ఎవరో కాదు ప్రకాశం జిల్లాలోని కొండపి ఎమ్మెల్యే. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి రాజీనామా చేసి.. రాజకీయాల్లోకి వచ్చిన స్వామి.. 2014 అసెంబ్లీ ఎన్నికలలో కొండపి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రకాశం జిల్లాలో కొండపి, ఒంగోలు నియోజక వర్గాల్లో పట్టున్న దామచర్ల కుటుంబం అండదండలతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. నియోజకవర్గంలో తొలి ఐదేళ్లలో పట్టు సాధించారు. టీటీడీ బోర్డు చైర్మన్ గా కూడా స్వామి పనిచేశారు. స్వామి వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరు ఉంది. తొలి ఐదేళ్లలో ప్రభుత్వం కూడా అధికారంలో ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన తనదైన ముద్ర వేశారు.

అందుకే 2019 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ప్రభంజనంలో కూడా తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పరిమితమైతే.. అందులో గెలిచిన ఎమ్మెల్యేలో స్వామి ఒకరు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్సీ నియోజకవర్గల‌లో తెలుగుదేశం పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. కొండపిలో మాత్రం స్వామి ఒకే ఒక్కడుగా గెలిచి రికార్డులోకి ఎక్కారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో.. నియోజకవర్గంలో జరిగిన ఎన్నో అరాచకాలను ఎదుర్కొని.. స్వామి దీటుగా నిలబడ్డారు. కేసులు పెట్టిన ఆయన ఎక్కడ వెనక్కి తగ్గలేదు.

ఒక ఎస్సీ ఎమ్మెల్యేగా ఉండి.. ప్రతిపక్షంలో గట్టి పోరాటం చేసిన నేతగా స్వామికి మంచి మార్కులు పడ్డాయి. ఈరోజు స్వామి పేరు చెబితే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. తాజా ఎన్నికలలో వైసీపీ నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఢీకొట్టిన స్వామి.. గెలిస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడితే.. కచ్చితంగా చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అవుతారనటంలో సందేహం లేదు. ఏది ఏమైనా అగ్రకులాలో ఉండి చంద్రబాబు వెనక నిలబడటం కాదు.. ఎస్సీ సామాజిక వర్గంలో ఉండి ఎన్ని ఒత్తిళ్లు ఇబ్బందులు ఎదురైనా నిలబడిన స్వామికి నిజంగా హాట్సాఫ్ చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: