సాధారణంగా ఒక రాజకీయ పార్టీ అధినేతకు అత్యంత నమ్మకస్తులు ఉంటారు వారు మొదటినుంచి చివరి వరకు ఆ అధినేతకు లాయల్ గా ఉంటూ వారికోసం ఏదైనా చేస్తుంటారు. టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుకు కూడా అత్యంత ఆప్తులుగా కొందరు నేతలు కొనసాగుతున్నారు. ఈ సీనియ‌ర్ నేత‌లు బాబు వెన్నంటే ద‌శాబ్దాల పాటు ఉంటూ వస్తున్నారు. ఆయ‌న‌కు కుడి, ఎడ‌మ భుజాలుగా వెలకట్టలేని మద్దతును అందిస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో బీసీ జ‌నార్థ‌న్ రెడ్డి ఒకరు. పార్టీ చాలా క‌ష్టాల్లో ఉన్నా చంద్రబాబును ఈ నేత వదలలేదు.

గడిచిన ఐదేళ్ల‌లో పలు కేసులను ఫేస్ చేశారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు అయినా సరే ఆయన కొంచెం కూడా భయపడలేదు. పోలీసులు, న్యాయస్థానాలను కూడా లెక్క చేయలేదు. జనార్ధన్ రెడ్డి జైళ్ల‌కు వెళ్లి పార్టీ కోసం ఎంతో చేశారు. న‌మ్మిన‌బంటుగా ఉంటూ చంద్రబాబు విజయాలలో అపజయాల్లో పాల్పంచుకుంటూ వస్తున్నారు.

కర్నూలు జిల్లాకు చెందిన ఈ రాజకీయ నాయకుడు. 2014లో బనగానపల్లె నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే విజయం సాధించారు. కేవలం చంద్రబాబుకి మాత్రమే మంచి చేయడం కాదు ఈయన తన నియోజకవర్గం ప్రజలకు కూడా ఎంతో మేలు చేశారు. నియోజకవర్గాన్ని చాలా డెవలప్ కూడా చేశారు ఆ కారణంగా ప్రజలు ఆయనను ఆశీర్వదిస్తున్నారు.

పోయినసారి వైసీపీ పార్టీ వైపు ఒక ఉప్పెనలాగా ప్రజల మద్దతు వెల్లువెత్తింది.  ఆ కారణంగా ఆయన 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ వైసీపీ పార్టీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఈసారి అంటే 2024 ఎన్నికల్లో మళ్లీ బీసీ జనార్దన్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి బనగానపల్లె నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈసారి ఆయన గెలిస్తే టీడీపీకి ఆయన అసలైన ఆస్తిగా మరోసారి నిరూపించుకున్నట్లు అవుతుంది. అలాగే చంద్రబాబు గెలిస్తే ఆ గెలుపులో ఈయన పాత్ర అత్యంత కీలకమవుతుంది. జూన్ 4వ తేదీన ఎవరు గెలుస్తారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: