గడిచిన ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందజేసింది. రాష్ట్రంలోని ప్రతి ఇంటి సభ్యులు కూడా ఈ ప్రభుత్వం ద్వారా ఆర్థికంగా ఎంతో లబ్ది పొందారు. సచివాలయం మెడికల్ క్లినిక్, లోకల్ పోలీస్, వాలంటీర్ వ్యవస్థ కారణంగా ప్రజలు చాలా సుఖంగా జీవించారు. అయితే సీఎం జగన్ పై ప్రశంసలే కాదు కొన్ని ఫిర్యాదులు కూడా వచ్చాయి ముఖ్యంగా మద్యం విషయంలో. చీప్‌ లిక్కర్ రాష్ట్రంలో ఏరులై పారుతోందని దాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రాష్ట్రంలో సరఫరా అవుతున్న నాసిరకం మద్యం తాగి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రతిపక్ష పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే చీప్ లిక్కర్ టాపిక్ గురించి ఏపీ సీఎం జగన్‌ను తాజాగా ప్రశ్నించారు. దీనికి సమాధానం ఆయన  వ్యక్తిగత అభిప్రాయంతో స్పందించారు. మద్యం తాగుతారా అని అడిగితే ఎలా సమాధానం చెబుతారు అలా సమాధానం చెప్పారు. జగన్ మాట్లాడుతూ.. “నేను మద్యం తాగను. ప్రజలు కూడా మద్యం సేవించకూడదని నేను అనుకుంటున్నా. రాష్ట్రంలో లిక్కర్ కంట్రోల్ పాలసీకి కట్టుబడి ఉన్నా. ఎట్టి పరిస్థితులలో దాన్ని అమలు చేస్తా" అని జగన్ అన్నారు. అయితే ఇక్కడ చీప్ లిక్కర్ గురించి మాత్రం ఆయన మాట్లాడకపోవడం గమనార్హం.

2019లో జగన్ మద్యంపై నిషేధం విధిస్తానని రాష్ట్ర ప్రజలందరి ముందు ప్రామిస్ చేశారు. కానీ ఆ ఒక్క మాట నిలబెట్టుకోలేకపోయారు. చివరకు ఏపీ ప్రజల కోసం వైసీపీ ప్రభుత్వం కొత్త ఆల్కహాల్ బ్రాండ్లను రాష్ట్రంలోకి అనుమతించింది. మద్యం విక్రయాలను గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తక్కువ ధరలకే నాణ్యమైన మద్యాన్ని తీసుకొస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ప్రజలు మద్యం సేవించడం తనకు ఇష్టం లేదంటూ జగన్ చీప్ లిక్కర్‌ అంశాన్ని తక్కువ చేసి మాట్లాడారు కానీ మందుబాబులు మాత్రం దీనిపై చాలా సీరియస్ గా ఉన్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: