ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సంగ్రామం ముగిసినా.. గలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ కు ఇంకా ఆరు రోజుల టైం ఉండడంతో అటు పార్టీలలో.. ఇటు ప్రజల్లో ఓటింగ్ పై తీవ్ర చర్చ కొనసాగుతుంది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలలో గెలిచేదెవరో? ఓడెదెవరు తెలియాలంటే కౌంటింగ్ డేట్.. జూన్ 4 వరకు ఆడాల్సిందే. కానీ అప్పటివరకు ఆగలేమంటున్నారు పొలిటికల్ ఫ్యాన్స్. ఫలితాలు రాకముందే తమ అభిమానం నేత గెలిచినట్లుగా పోస్టర్లు మరియు స్టిక్కర్ల తో ఆయా పార్టీల కార్యకర్తలు.. తెగ హడావిడి చేస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఈ ‌ స్టిక్కర్ల‌ ఫైట్ ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా కోనసీమ, కాకినాడ జిల్లాల్లో స్టిక్కర్ల ఫైట్ జోరుగా సాగుతుంది. టోటల్ అసెంబ్లీలోనే ఆసక్తికర ఎలక్షన్ వైట్ పిఠాపురంలో జరిగింది. ఎక్కడ జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.‌.. వైసిపి నాయకురాలు వంగ గీత పోటీ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఫలితాలకు ముందు.. మా ఎమ్మెల్యే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వంగ  గీత పేరుతో స్టిక్కర్లు హల్చల్ చేస్తున్నాయ్. పవన్ మా ఎమ్మెల్యే అంటూ బైక్స్‌పైన.. గీత డిప్యూటీ సీఎం అంటూ కార్ల పైన స్టిక్కర్లు వేసుకుంటూ అభిమానులు కదా హడావిడి చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే.. అమలాపురంలో అయిత బత్తుల ఆనందరావు, పినిపె‌ విశ్వరూప్ అభిమానుల మధ్య స్టిక్కర్ల ఫైట్ నడుస్తుంది. మా ఎమ్మెల్యే అంటూ.. బైకులు మరియు క‌రులపై నే కాకుండా సోషల్ మీడియాలో కూడా రచ్చ చేస్తున్నారు. ఇక ఎన్నికల ఫలితాలకు ముందే ఆయా ‌ నేతల అభిమానులు పోస్టర్లతో హడావిడి చేస్తుండడం ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్టిక్కర్ల రాజకీయం చూసి పలువురు జనాలు ఆశ్చర్యపోతున్నారు. మునిపెన్నడు ఇటువంటివి జరగలేదు. ఎన్నికల అయిన అనంతరం అందరూ కామ్ అయిపోయేవారు. కానీ ఈసారి ఎన్నికలు డిఫరెంట్ గా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: