- ఈ సారి గెలిస్తే విశాఖ నుంచే పాల‌న అని చెప్పిన జ‌గ‌న్‌
- భార‌త్‌లో అమ‌రావ‌తి ప్రాధాన్యం జీరోనే..!

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీ ప్ర‌జ‌ల ఆకాంక్ష‌.. దేశంలోనే న‌వ‌న‌గ‌రాలు ఉన్న రాజ‌ధానిగా భాసిల్లాల్సిన అమ‌రావ‌తి గ‌త ఐదేళ్ల‌లో ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొన్న‌దో అంద‌రికీ తెలిసిందే. ముందు రాజ‌ధాని అమ‌రావ‌తిని ఒప్పుకొని.. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఇక్క‌డ అవినీతి జ‌రుగుతోంద‌ని పేర్కొంటూ.. పూర్తిగా రాజ‌ధాని న‌గ‌రాన్ని వైసీపీ స‌ర్కారు విస్మ‌రించింది. మొత్తంగా ఐదేళ్లు గ‌డిచిపోయాయి. అంతేకాదు.. ఈ రాజ‌ధాని కోసం.. అనేక మంది రైతులు మూడు సంవ‌త్స‌రాలుగా ఉద్య‌మించారు. అనేక కేసులు ఎదుర్కొన్నారు.


క‌నీసం వ‌చ్చే ఐదేళ్ల‌లో అయినా.. త‌మ‌కు న్యాయం జ‌ర‌గాల‌ని..ఇక్క‌డి రైతులు కోరుతున్నారు. ఇక‌, రాజ ధాని లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి దిక్సూచి కావాల‌ని స‌మాజంలోని మెజారిటీ ప్ర‌జ‌లు కూడా కోరుతున్నా రు.  ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాద్ కాల ప‌రిమితి కూడా.. వ‌చ్చే నెల 2తో తీరిపోనుంది. దీంతో.. రాజ‌ధాని నిర్మాణం జ‌ర‌గాల‌ని.. అంద‌రి రాజ‌ధానిగా అమ‌రావ‌తి ఉండాల‌ని కోరుకునేవారు పెరిగారు. అయితే.. ఇది ఎవ‌రికి సాధ్యం అంటే.. ఖ‌చ్చితంగా టీడీపీ అధికారంలోకి వ‌స్తేనే సాధ్య‌మ‌వుతుంద‌న్న విష‌యం తెలిసిందే.


ఇదే విష‌యాన్ని చంద్ర‌బాబు, టీడీపీ నాయ‌కులు కూడా క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి ప్ర‌చారం చేసుకు న్నారు. దేశ‌విదేశాల నుంచి వ‌చ్చిన వారు కూడా.. ఇదే విష‌యం చెప్పారు. అంటే.. రాజ‌ధాని నిర్మాణం అనేది టీడీపీ అధికారంలోకి వ‌స్తేనే సాకారం అవుతుంద‌నే విష‌యం స్ప‌ష్టంగా ప్ర‌జ‌ల‌కు తెలుసు. అయితే.. టీడీపీ అధికారంలోకి రావాలంటే.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విష‌యంపై అవ‌గాహ‌న ఉండి ఉండాలి. కానీ.. అది జ‌రిగిందా?  లేదా? అనేది.. రేపు రిజ‌ల్ట్ వ‌చ్చాక కానీ.. తెలిసే విష‌యంకాదు.


ఒక‌వేళ‌.. టీడీపీ క‌నుక అధికారంలోకి రాక‌పోతే.. ఖ‌చ్చితంగా తొలి దెబ్బ అమ‌రావ‌తిపైనే ప‌డుతుంది. ఎం దుకంటే.. వైసీపీ ఇప్ప‌టికే.. తాము మ‌రోసారి అధికారంలోకి వ‌స్తే.. విశాఖ నుంచే పాల‌న ప్రారంభిస్తామ‌న చెప్పింది. అంతేకాదు.. ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం కూడా.. అక్క‌డే ఉంటుంద‌ని తేల్చి చెప్పింది. దీంతో వైసీపీ క‌నుక వ‌స్తే.. అమ‌రావ‌తి లేదు.. ఇక్క‌డి రైతుల ఆక్రంద‌నా.. ఎవ‌రికీ వినిపించ‌దు. సో.. మొత్తంగా టీడీపీ క‌నుక అధికారంలోకి రాక‌పోతే.. తెలుగు ప్ర‌జ‌ల‌కు న‌వ‌న‌గ‌రాల‌తో  కూడిన అమ‌రావ‌తి లేన‌ట్టేన‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: