ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కూటమి ప్రభుత్వం కొలువుదీరింది.  ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా అతని క్యాబినెట్ లో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.  కుల, సామాజిక, ప్రాంతాల ఆధారంగా చంద్రబాబు మంత్రివర్గంలో చాలామందికి చోటు కల్పించారు. ముఖ్యంగా ఈసారి యువతకే ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ మంత్రివర్గంలో ముగ్గురు మహిళా మంత్రులు కూడా ఉన్నారు. ఇందులో ఇద్దరు మంత్రులు కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచినవారు మరో మంత్రి రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే. మరి ఈ ముగ్గురు మహిళా మంత్రులు ఎవరు.. వారు ఇంతకుముందు ఏం పని చేసేవారు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.  

చంద్రబాబు క్యాబినెట్ లో చోటు దక్కించుకున్న మంత్రులలో ముందుగా చెప్పవలసింది పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన  వంగలపూడి అనిత. అలాగే పార్వతీపురం మాన్యం జిల్లా నుంచి సాలూరు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి సంధ్యారాణి, అనంతపురం జిల్లా పెనుగొండ ఎమ్మెల్యేగా గెలిచిన ఎస్ సవిత ఉన్నారు. ఈ మహిళా మంత్రుల్లో ఒక ఎస్సీ, మరొకరు ఎస్టి, ఇంకొకరు బీసీ వర్గాలకు చెందినవారు. ఇందులో టిడిపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి అనిత పాయకరావుపేట నుంచి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చోటు దక్కించుకుంది. ఈమె రాజకీయాల్లోకి రాకముందు ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఇక మరో మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈమె రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలైంది.

కానీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ఈ సంధ్యారాణి 1999 కాంగ్రెస్ పార్టీ ద్వారా అరంగేట్రం చేసింది.  అలాంటి ఈమె విజయనగరంలోని ఎమ్మార్ మహిళా కళాశాల నుంచి బీఎస్సీ పూర్తి చేసింది. మొదటిసారి పోటీ చేసి విజయం సాధించి క్యాబినెట్ లో చోటు దక్కించుకున్న మరో మహిళా ఎమ్మెల్యే సంజీవరెడ్డి గారి సవిత. ఈమె రాష్ట్రంలో ఇదివరకు మంత్రిగా పనిచేసిన సోమందేపల్లి రామచంద్రారెడ్డి కుమార్తె.  ఈమె అనంతపురం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి బిఏ పూర్తి చేసింది. ఈమె మంత్రి అవ్వకముందు  టిడిపి ప్రభుత్వ హయాంలో ఏపీ కురుబ సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసింది. పోయిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పై 33,000వేల ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఈసారి భారీ విజయం అందుకుంది

మరింత సమాచారం తెలుసుకోండి: