ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎక్కువ సంఖ్యలో హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయడం అసాధ్యమని కామెంట్లు వినిపించగా చంద్రబాబు మాత్రం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని చెబుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు కొన్ని హామీల అమలు కోసం కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మరికొన్ని రోజుల్లో కొన్ని హామీలు అమలు కానున్నాయి.
 
అయితే రైతు భరోసా, 50 ఏళ్లకే పెన్షన్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15000 రూపాయలు ఈ స్కీమ్స్ అన్నీ కచ్చితంగా అమలు చేయాల్సిన స్కీమ్స్ అనే సంగతి తెలిసిందే. ఈ స్కీమ్స్ ను ఎంత ఆలస్యం చేస్తే బాబుకు అంత నష్టమని చెప్పవచ్చు. కనీసం ఎప్పటినుంచి అమలు చేస్తారో క్లారిటీ ఇస్తే అయినా బాగుంటుంది.
 
కూటమి ప్రభుత్వం అమలు చేయాల్సిన సంక్షేమ పథకాల విషయంలో ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ఈ పథకాలను అమలు చేస్తే ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలను తాము ప్రకటించలేమని వైసీపీ చెప్పి దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.
 
కూటమి ప్రతి హామీని అమలు చేస్తే మాత్రమే భవిష్యత్తులో కూడా కూటమి గెలుపునకు తిరుగుండదు. హామీల అమలు విషయంలో కూటమి వ్యూహాలు ఎలా ఉంటాయో పవన్ ఎలా హామీల అమలు విషయంలో జోక్యం చేసుకుంటారో చూడాల్సి ఉంది. మరో ఆరు నెలల్లో కూటమి పాలన గురించి పూర్తిస్థాయిలో క్లారిటీ రానుంది. వైసీపీ మాత్రం కొన్ని నెలల పాటు ఓపికగా ఎదురుచూస్తామని సోషల్ మీడియా పోస్టులు చేయడం కొసమెరుపు. ఏపీకి ఉన్న ఆర్థిక ఇబ్బందులను చంద్రబాబు నాయుడు ఏ విధంగా అధిగమిస్తారో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: