అమ్మ‌! జీవితాన్ని ఇచ్చేది ఈ రెండు అక్ష‌రాల అమ్మే! అయితే.. కొంద‌రి జీవితాల‌ను మార్చేది కూడా అమ్మే! దేవుడే లేడ‌నే మ‌నిషి ఉంటాడు కానీ.. అమ్మ‌లేద‌నే వాడు ఉండ‌డ‌న్న‌ట్టుగా.. అమ్మ చేతి ముద్ద తిన‌ని వారు కూడా ఉండ‌రు. కొంద‌రి అమ్మ‌.. త‌నువును ప్ర‌సాదిస్తే.. మ‌రికొంద‌రికి జీవితాన్నే ప్ర‌సాదిస్తుంది., ఇలాంటి వారిలో కోటిరెడ్డి స‌రిప‌ల్లి ఒకరు. నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా డాక్ట‌ర్ కోటిరెడ్డి స‌రిప‌ల్లి.. అంద‌రికీ సుప‌రిచితులే..! అయితే, ప్ర‌పంచం మెచ్చేలా ఆయ‌న ఎద‌గ‌డం వెనుక‌, ప్ర‌పంచ స్థాయి టెక్నాల‌జీ నిపుణుడిగా ఆయ‌న రాణించ‌డం వెనుక‌.. అక్ష‌రాలా ఉన్న‌ది అమ్మే!!   అమ్మ చేతి చ‌లువ ఏమిటో కోటిరెడ్డికి తెలిసినంత‌గా ఎవ‌రికీ తెలియ‌దంటే అతిశ‌యోక్తి లేదు. ప‌దో త‌ర‌గ‌తి పూర్త‌యింది.


మ‌ట్టినే న‌మ్ముకుని, కాయ‌క‌ష్టం చేసుకుని, కుటుంబాన్ని పోషించే నాన్న‌.. పైచ‌దువులు చదివించే స్థోమ‌త త‌న‌కు లేద‌ని చెప్పినా.. క‌ల‌ల సాకారం కోసం త‌పించిన చిన్న వ‌య‌సులో చేయి అందించి పైకి వ‌చ్చేందుకు దోహ‌ద‌ప‌డిన మూర్తిమ‌త్వం .. కోటిరెడ్డి మాతృమూర్తి! పండ‌గ‌కు బ‌ట్ట‌లు కొనుక్కునేందుకు ఆవిడ ఇచ్చిన 1000 రూపాయ‌లు.. వెయ్యిమంది దేవ‌త‌ల ఆశీర్వాద పుణ్య‌ఫ‌లంగా కోటిని ముందుకు న‌డిపించాయి. ఆ వెయ్యే పెట్టుబ‌డిగా ఆయ‌న వేసిన అడుగులు టెక్నాల‌జీవైపు ప‌రుగులు పెట్టించాయి.అమ్మ ఇచ్చిన రూ.1000 పెట్టుబ‌డితో పీజీడీసీఏ నేర్చుకుని కంప్యూట‌ర్ ప్ర‌పంచంలోకి అడుగులు వేసిన కోటిరెడ్డి.. త‌ర్వాత కొన్ని సంవ‌త్స‌రాల‌పాటు.. త‌న క‌ల‌లు సాకారం చేసుకునేందుకు క‌ష్టించాల్సి వ‌చ్చి నా.. అమ్మ ప్రోత్సాహం.. అమ్మ ఇచ్చిన‌ ఆర్ధిక ఊతం.. అంబ‌ర ల‌క్ష్యాన్ని సునాయాశంగా చేరుకునేందుకు అవ‌కాశం క‌ల్పించాయి.


జేబులో ఏడు వంద‌ల‌తో హైద‌రాబాద్‌కు వ‌చ్చిన రోజు ఆయ‌న క‌ళ్ల‌లో నేటికీ క‌నిపిస్తుంది. ఆ వెంట‌నే త‌న ల‌క్ష్య సాధ‌న‌లో మునిగి.. దానిని సాధించే వ‌ర‌కు పోరాడిన ప‌టిమ ఆయ‌నలో దాగి ఉన్న మ‌రిన్ని ల‌క్ష్యాల దిశ‌గా ప‌రుగిడేలా చేస్తుంది. దీనంత‌టికీ.. కార‌ణం.. అమ్మ‌.. ఆమె ఇచ్చిన వెయ్యి రూపాయ‌లు.. అందుకే.. కోటిరెడ్డి జీవితంలో అమ్మ ప్ర‌త్యేకం! అమ్మ దేవుడిచ్చిన వ‌రం!!  ఆ వెయ్యి రూపాయ‌లే ఆయ‌న్ను గుడివాడ నుంచి ప్ర‌ఖ్యాత మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం వ‌ర‌కు న‌డిపించాయి. ఈ రోజు 14 కంపెనీల‌కు బాస్‌ను చేయ‌డంతో పాటు ఆయ‌న ద్వారా వంద‌ల మందికి ఉపాధి క‌ల్పించేందుకు కార‌ణ‌మ‌య్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: