రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా సోమవారం ప్రారంభించింది. సీఎం చంద్రబాబు స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు ఇచ్చారు. అయితే అంతకు ముందు పేపర్లలో ప్రకటనలను ఏపీ ప్రభుత్వం ఇచ్చింది. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి పవన్, ప్రధాని మోడీ ఫొటోలు ఉంటాయని అంతా భావించారు. అయితే అందుకు విరుద్ధంగా కేవలం చంద్రబాబు ఫొటో మాత్రమే ఆ ప్రకటనలలో ఉంది. ఈనాడు అధినేత రామోజీరావు సంస్మరణ సభలో సైతం ఇదే తరహా వాతావరణం కనిపించింది. దీంతో కావాలనే జనసేనను టీడీపీ అవమానిస్తోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇదంతా పవన్‌కు తెలిసి జరుగుతుందా? లేక తెలియకుండా జరుగుతుందా అనే చర్చ సాగుతోంది. సాధారణంగా పంచాయతీరాజ్ శాఖ పరిధిలోనే పింఛన్ల పంపిణీ ఉంటుంది. ఆ శాఖ మంత్రి పవన్ ఫొటో లేకుండా ప్రస్తుతం కార్యక్రమం జరగడంతో విభేదాలు తలెత్తాయనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై పవన్, చంద్రబాబు అధికారికంగా ఇంకా స్పందించలేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి