గత కొంతకాలం నుంచి మెయిన్ మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దివ్వెల మాధురికి సంబంధించిన వ్యవహారమే మనకు కనిపిస్తోంది. దువ్వాడ ఫ్యామిలీ వివాదంలో కీలకంగా ఉన్నటువంటి మాధురి  తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా, మెయిన్ మీడియా ద్వారా బయటపెడుతోంది. దీంతో వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకు ఒక మలుపు తిరుగుతూ అందరికీ ఆసక్తికరంగా మారింది.  అయితే దువ్వాడ శ్రీనివాస్ నివాసముండే కొత్త ఇంటి ఎదురుగా అతని భార్య దువ్వాడ వాని కూతుర్లు నిరసన కొనసాగిస్తూ వస్తున్నారు. అంతే కాదు శ్రీనివాస్ కూడా గత కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటు కనీసం బయటకు రావడం లేదు. దీంతో వీరి మధ్య సయోధ్య కుదుర్చుకోవడం కోసం ఓపక్క కుటుంబ పెద్దలు చర్చలు జరుపుతూ ఉండగానే వాణి కోర్ట్ ను ఆశ్రయించింది. 

అలాంటి వాణి తాజాగా ఒక షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం..ఆమె ఇప్పటినుంచి సోషల్ మీడియాకు మెయిన్ మీడియాకు దూరంగా ఉండాలని భావించిందట. తనకు అనారోగ్యం వచ్చిందని ఈ కారణంగా పది రోజులపాటు పూర్తిగా ఇంటిపట్టునే ఉంటానని కనీసం బయటకు కూడా రానని చెప్తుంది. బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల  తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చాయని తెలియజేసింది. పరిస్థితి సీరియస్ అవ్వడంతో డాక్టర్లు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారట.  దీంతో దివ్వెల మాధవి పది రోజులపాటు పూర్తిగా బాహ్య ప్రకాశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పింది.

ఇదే తరుణంలో ఒక వీడియో రిలీజ్ చేసి  నేను మీ అందరిని మిస్ అవుతున్నానని, నాకు సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, మళ్లీ ఆరోగ్యం కుదుట పడ్డాక మీ అందరితో వివరంగా మాట్లాడుతానని చెప్పుకొచ్చింది. వారం రోజుల క్రితం కారు యాక్సిడెంట్ వల్ల మాధురి గాయపడింది. ఆమెకు హెడ్ ఇంజురీ కావడంతో,  బ్లడ్ క్లాట్ అయిందట. దీంతో ఆమెకు  సీరియస్ అవుతోందని డాక్టర్లు చెప్పడంతో ఆమె పది రోజుల పాటు డాక్టర్ల పర్యవేక్షణలో పూర్తిగా ఇంటిపట్టునే ఉండాలని నిర్ణయం తీసుకుందట. ఈ విషయాన్ని ఒక వీడియో ద్వారా బయట పెట్టింది. ఇది కాస్త వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: