-విద్యార్థుల భవిష్యత్తు మార్చిన పథకం.
- రూపురేఖలు మార్చుకున్న ప్రభుత్వ పాఠశాలలు.
సాధారణంగా ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాయి. ఒక ఐదు ఏళ్ళు ఒక పార్టీ అధికారంలో ఉంటే మరోసారి ఇంకో పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అలా ఏ పార్టీ పాలించిన పదేళ్ల కంటే ఎక్కువ పాలించడం కష్టం. అలా పార్టీలు మారుతూ ఉండడం వల్ల రాష్ట్రంలో పథకాల పేరుతో పాటు, స్థలాల పేర్లు ప్రభుత్వ కార్యాలయాల పేర్లు మారుస్తూ ఉంటారు. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి ఎన్నో పథకాలు, కార్యాలయాలు, విద్యాసంస్థల పేర్లను జగన్ ప్రభుత్వం వచ్చాక మార్చేశారు. ఒక ప్రభుత్వంలో ఉన్న పేర్లను ఇంకో ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేర్లు ఇతర సంస్థల పేర్లు మారడం మనం ఎప్పటినుంచో చూస్తూ వస్తున్నాం. అలా చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పథకం అయినటువంటి "బడిబాట" పేరును మార్చేసి "నాడు నేడు"గా మార్చారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇక నాడు నేడులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల తీరే మారిపోయింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
బడిబాట నుంచి నాడు నేడుగా:
జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలే మారాయి అని చెప్పవచ్చు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను తయారుచేసి వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును మార్చాలని చెప్పవచ్చు. బడిబాటగా ఉన్నటువంటి పథకాన్ని నాడు నేడుగా మార్చి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేశారని చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం 2019 నవంబర్ 14న నాడు నేడు పథకాన్ని ప్రారంభం చేసింది. ఈ స్కీం కింద ఎన్నో పాఠశాల రూపురేఖలు మారిపోయాయని చెప్పవచ్చు. అంతకుముందు స్కూల్స్ లో పూర్తిగా డ్రాప్ ఔట్స్ ఉండేవి. నాడు నేడు ఇంప్లిమెంట్ అయిందో అప్పటినుంచి డ్రాప్ అవుట్స్ తగ్గిపోయి స్కూళ్లలో విపరీతమైనటువంటి అడ్మిషన్స్ అయ్యాయి. అంతేకాదు జగన్ ముందు ఏపీని ఎన్నో ప్రభుత్వాలు పాలించాయి. ఏ నాయకుడు కూడా ప్రభుత్వ పాఠశాల రూప రేఖలు మాత్రం మార్చలేదు. కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ:5వేల కోట్లు కేటాయించి పూర్తిగా కార్పొరేట్ పాఠశాలకు దీటుగా స్పెషల్ ఆప్పీరియన్స్ వచ్చే విధంగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేశాడు. పాఠశాలలను టాయిలెట్ నుంచి మొదలు ప్రతి ఒక్కటి అత్యాధునికంగా తీర్చిదిద్దాడు. ఇదే కాదు ప్రతి సబ్జెక్టుకు టీచర్ ఉండే విధంగా ఇంగ్లీష్ విద్యా బోధనను అమలు చేశాడు. ఈ విధంగా ప్రతి పాఠశాలలో నాడు నేడు స్కీం కింద 2019 నుంచి 2022 ఎండింగ్ వరకు మొత్తం 44,512 స్కూళ్లను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాడు.
అద్భుతమైన వసతులు:
పక్కా భవనాలు.
టాయిలెట్ల నిర్మాణం
విద్యార్థుల సిబ్బంది కోసం ఫర్నిచర్.
పాఠశాలలకు పెయింటింగ్
కాస్త పాడైన పాఠశాలలకు మరమ్మతులు.
ఆకుపచ్చ సుద్ద బోర్డులు
ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు విద్యుద్ధికరణ
ఇంగ్లీష్ ల్యాబ్స్
అన్ని సర్కారు పాఠశాలలో కాంపౌండ్ గోడలు
విద్యార్థులకు క్లాస్ రూమ్ లు
విద్యార్థులకు ట్యాబ్లెట్ ఇలా ఎన్నో వసతులు కల్పించి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టారని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి