జమ్మూ కాశ్మీర్లో పహాల్గాంలో చేసిన ఉగ్రవాదుల దాడి వల్ల ఇండియన్ గవర్నమెంట్ పాకిస్తాన్ కి సంబంధించి పలు రకాల కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకున్నది. ముఖ్యంగా సింధు నది జలాల విషయంలో అలాగే ఇండియా నుంచి పాకిస్తాన్ వాళ్లు వెళ్లిపోవాలని, పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి రావకుండా చెక్ పోస్ట్ ని కూడా మూసివేశారు.. ఇక ఇవే కాకుండా పాకిస్తాన్ కు దీటుగా యుద్ధ సంకేతాలను కూడా పంపించడం జరిగింది. అయితే యుద్ధ  వాతావరణం కనిపిస్తూ ఉండడంతో పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభం మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


పాకిస్తాన్ భారత్ తో ఏ క్షణమైనా కూడా యుద్ధాన్ని మొదలు పెట్టవచ్చని వార్తలు వినిపిస్తూ ఉండు తరుణంలో ఆ దేశ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగిపోయిందట. ఇప్పటికే అక్కడ ఆహార పదార్ధ ధరలు కూడా ఎక్కువగా పెరిగిపోయాయని తెలుస్తోంది.. సాధారణంగా ఉపయోగించే బియ్యం కూరగాయలు చికెన్ పండ్లు కాయగూరల ధరలు కూడా ఆకాశాన్ని తాగుతున్నాయట. అయితే పాకిస్తాన్లో కేజీ చికెన్ ధర 800 రూపాయలు.. కేజీ బియ్యం ధర 350 రూపాయలు.. డజన్ గుడ్లు 330 రూపాయలు.. యాపిల్ కేజీ 300 , లీటర్ పాలు 245.. అరటి పండ్లు డజన్ 176 రూపాయలు.. ఆరంజ్ 216 రూపాయలు, టమోటా కిలో 150 రూపాయలు ఇలా అన్నీ కూడా అధిక ధరకే పలుకుతున్నాయట. లీటర్ నీటి ధర కూడా భారీగానే పెరిగిపోయిందట.


ఎగుమతుల పైన భారత్ విధించినటువంటి ఆంక్షల కారణంగానే పాకిస్థాన్ లో ఇప్పుడు చాలా ద్రవ్యోల్బణం ఏర్పడింది. ముఖ్యంగా అక్కడ అత్యవసర మందులకు కొరత కూడా తీవ్రంగా ఏర్పడిందని అక్కడ ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ఇప్పటికే పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా పడిపోయిందనే విధంగా పలువురు నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో అక్కడ వారు యుద్ధాన్ని ప్రకటిస్తారా లేదా అన్నది చూడాలి మరి. వీటికి తోడు జవాన్లు, పలువురు అధికారులు కూడా రాజీనామాలు చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి: