
మోదీ పీఎంఓ కు వెళ్లకుండా ఎయిర్పోర్టులోనే ఒక సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించి ఉగ్రదాడిది ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న పరిణామాలను తెలియజేశారు. దీంతో పాకిస్తాన్ తో ఉన్న సింధు జలాల ఒప్పందాన్ని కూడా ఆపివేశారు. దీంతో ఆ దేశ జీడీపీలో దాదాపుగా 24 శాతం ఈ జలాల నుంచి లభించేదట. అలాగే పాకిస్తాన్ సైనిక, రవాణా ,పౌర విమానాల కోసం కూడా భారత్ గగనతలాన్ని మూసివేసింది. పాకిస్తాన్ దేశీయుల వీసాలను కూడా రద్దు చేయడం జరిగింది. పాకిస్థాన్ పౌరులను కూడా ఇండియా నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. బార్డర్ గేర్లను కూడా మూసివేశారు.
వీటికి తోడు పాకిస్తాన్ నటుల నటించిన సినిమా రిలీజ్లను కూడా ఆపివేశారు. అలాగే క్రికెటర్లు రాజకీయ నాయకులతో సహా పలువురు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా ఖాతాలకు భారత్ బ్లాక్ చేయడం జరిగింది. పాకిస్తాన్ తో వాణిజ్య సంబంధాలను కూడా తెంపేసుకుంది భారత్. పాకిస్తాన్ నుంచి దిగుమతులు ఆదేశానికి ఎగుమతులను కూడా ఆపివేశారు. సుమారుగా 500 మిలియన్ డాలర్ల వరకు పాకిస్తాన్ కి నష్టం ఏర్పడింది. (పండ్లు, ఎండు ఖర్జూరాలు, రాక్ స్టాల్, లెదర్ వస్తువులు ఇతరత్రా వస్తువులు.. ఇండోనేషియా, సింగపూర్ ,యూఏఈ ,శ్రీలంక వంటి దేశాలకు ఎగుమతులు చేసేవారట.)అలాగే బీహార్లో ఒక సభలో మోదీ మాట్లాడుతూ ఉగ్రవాదులను ఊహించని రీతిలో శిక్షిస్తామంటూ తెలియజేశారు. ఇక తర్వాత అన్ని రాజకీయ పక్షాలు కూడా ప్రభుత్వం తీసుకునే వాటికి మద్దతు తెలియజేశారు. ఆ తర్వాతే కొన్ని ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేశారు.