భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య అనధికారికంగా యుద్ధం మొదలైనట్టేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ కు ఈ యుద్ధం వల్ల భవిష్యత్తులో సైతం ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భారత ఆర్మీ అధికారులు ఎంతమంది మృతి చెందారో కచ్చితమైన లెక్క చెప్పడం లేదనే సంగతి తెలిసిందే. ఎందుకంటే ఆ లెక్క సులువుగా తేలే లెక్క కానే కాదు.
 
విమానాలు, డ్రోన్ల సంఖ్యకు సంబంధించి కూడా మన దేశ ఆర్మీ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదనే చెప్పాలి. యుద్ధ వ్యూహంలో భాగంగా భారత్ ఈ విధంగా అడుగులు వేసింది. అయితే దాడి చేయడానికి గల కారణాలను, ఇతర కీలక విషయాలను మాత్రం వ్లెలడించడం జరిగింది. అయితే పాకిస్తాన్ మాత్రం మన దేశం విషయంలో విచిత్రమైన ఆరోపణలు చేస్తూ వ్యవహరిస్తోంది.
 
పాకిస్తాన్ ప్రధాని తన మాటలతో పార్లమెంట్ నే తప్పుదోవ పట్టించడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సంచలనం అవుతోంది. భారత్ వైమానిక దాడులను తన సైన్యం తిప్పికొట్టిందంటూ పాక్ ప్రధాని కామెంట్లు చేశారు. పాక్ సైనిక దళాలు ముందుగానే సిద్ధంగా ఉన్నాయని అత్యంత వేగంగా స్పందించాయని పేర్కొన్నారు.
 
తమ సైన్యం 5 భారత యుద్ధ విమానాలను ధ్వంసం చేసిందని ఆయన చెప్పగా అందుకు సంబంధించిన ఆధారాలను చూపించే విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. అయితే వాస్తవాలు తెలియనివి కావు. పాక్ ప్రధాని ఆ దేశ ప్రజల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. మన దేశం ఇస్తున్న షాకులకు పాక్ ఆర్మీ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ ప్రస్తుతం ఒకింత విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం వల్ల పాక్ కు ఆర్థికంగా ఊహించని స్థాయిలో నష్టం తప్పదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని చెప్పవచ్చు. తీరు మార్చుకోకపోతే పాకిస్తాన్ కు భవిష్యత్తులో సైతం ఇబ్బందులు తప్పవు.





 


మరింత సమాచారం తెలుసుకోండి: