ఇండియా పాకిస్తాన్ వార్ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ అప్పు కోసం పలు బ్యాంకుల వద్ద చేతులు చాస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF పాకిస్తాన్ కి భారీ సాయం చేసింది. ఏకంగా బిలియన్ యూఎస్ డాలర్ల అప్పు ఇవ్వడంతో ఈ విషయం తెలిసిన భారత్ ఐఎంఎఫ్ఐ పై మండిపడింది.అంతేకాదు పాకిస్తాన్ కి చేసిన సహాయం కారణంగా భారతదేశం సంచలన నిర్ణయం తీసుకుంది. మరి ఇంతకీ ఐఎంఎఫ్ పాకిస్తాన్ కి ఎంత సహాయం చేసింది.. ఎన్ని కోట్లు ఇచ్చింది.. భారత్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. ఇండో-పాక్ వార్ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ చేతులు చాస్తూ అప్పులు అడుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ పాకిస్తాన్ కి ఏకంగా ఒక బిలియన్ యూఎస్ డాలర్ల అప్పు ఇచ్చింది.ఒక బిలియన్ యూఎస్ డాలర్ అంటే 7,500 కోట్ల అప్పు ఇచ్చింది అన్నమాట.అయితే ఈ విషయం తెలిసిన భారత్ ఐఎంఎఫ్ పై మండిపడింది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులను తయారు చేస్తుంది. అలాంటివారికి ఇన్ని కోట్ల అప్పు ఇవ్వడం అవసరమా అంటూ ప్రపంచ బ్యాంక్ ముందు భారత ప్రభుత్వం ఒక ఇష్యూ లేవనెత్తింది. అంతేకాదు మీరు ఇచ్చిన డబ్బుని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారని,ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఐఎంఎఫ్ పాకిస్తాన్ కి ఇచ్చే అప్పుపై ఓటింగ్ ని ఇండియా బహిష్కరించడంతో పాకిస్తాన్ కి పెద్ద షాక్ తగిలినట్టు అయింది.

 అయితే ఐఎంఎఫ్ తమకి 7,500 కోట్ల అప్పుని ఇవ్వడంతో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.మేము మొదట 7 బిలియన్ల యూఎస్ డాలర్లని అప్పుగా అడిగితే మాకు ఒక బిలియన్ యూఎస్ డాలర్ ని అప్పుగా  ఇచ్చినందుకు సంతోషంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు పాకిస్తాన్ ఇండియా మధ్య వార్ మరింత తీవ్రతరం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: