దేశ రాజధాని ఢిల్లీలో అకస్మాత్తుగా పెరిగిన ఉష్ణోగ్రతలు కేవలం వాతావరణ మార్పుల వల్ల మాత్రమే కాదు, ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న వరుస అత్యవసర సమావేశాల వేడి కూడా దీనికి కారణం. అంతర్జాతీయ సరిహద్దుల నుంచి అందిన కీలక, రహస్య సమాచారంతో పాటు, దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులతో మోడీ మంతనాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. అసలు ఈ భేటీల వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి, భారత్ ఏం చేయబోతోంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కొందరు అజ్ఞానులు, వెటకారపు మేధావులు చేసే విమర్శలను పక్కన పెడితే, భారత్ అనుసరిస్తున్న వ్యూహం అత్యంత పకడ్బందీగా, బహుముఖ ప్రణాళికతో సాగుతోంది. ఉగ్రవాదులు ఎన్నిసార్లు రెచ్చగొట్టినా, ఎంతటి దారుణ మారణహోమం సృష్టించినా, మత ప్రాతిపదికన భారత పౌరులను పొట్టన పెట్టుకున్నా, భారత్ మాత్రం సంయమనం వీడలేదు. తీవ్రవాద శిబిరాలే లక్ష్యంగా, ఉగ్రవాదులే టార్గెట్‌గా సాగుతున్నది తప్ప, అమాయక ప్రజలపై ప్రతీకార దాడులకు పాల్పడలేదు. ఇది భారత్ నైతికతను, వ్యూహాత్మక పరిణతిని ప్రపంచానికి చాటిచెబుతోంది.

నిఘా వర్గాల నుంచి అందిన ఖచ్చితమైన సమాచారంతో, శత్రువు ఊహించని రీతిలో ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన చరిత్ర మనకుంది. "మేం మట్టుబెట్టింది కరడుగట్టిన ఉగ్రవాదులనే, వారు మా పౌరుల ప్రాణాలు తీస్తున్నారని, మా దేశ సార్వభౌమత్వానికి సవాల్ విసురుతున్నారని, మా సైనిక స్థావరాలపై దాడులకు తెగబడుతున్నారని" భారత్ పదేపదే ప్రపంచానికి వివరిస్తూ వస్తోంది. ఇది మొదటి అస్త్రం.

రెండోది, శత్రువుల దాడులను సమర్థవంతంగా నిరోధించగలిగామని, మనకు నష్టం జరగకుండా చూసుకోగలిగామని నిరూపించడం. వారి డ్రోన్లు కావచ్చు, ఇతర కుట్రలు కావచ్చు, వాటిని మార్గమధ్యంలోనే ఛేదించగల సత్తా, సాంకేతిక పరిజ్ఞానం, అపారమైన నైపుణ్యం భారత్ సొంతమని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. "మా సత్తా ఇది, మీ ఆటలు సాగవు" అనే స్పష్టమైన సంకేతాలను పంపడంలో భారత్ ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇది మూడో సిగ్నల్.

ప్రస్తుత అత్యవసర సమావేశాల పరంపర కూడా ఈ వ్యూహంలో భాగమే. ఓ వైపు అజిత్ దోవల్ క్షేత్రస్థాయి వ్యూహాలపై కసరత్తు చేస్తుంటే, మరోవైపు రక్షణ మంత్రి త్రివిధ దళాధిపతులతో సమన్వయం చేస్తున్నారు. అదే సమయంలో, విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రపంచ దేశాలకు వాస్తవ పరిస్థితులను వివరిస్తూ, భారత్ వాదనకు దౌత్యపరమైన మద్దతు కూడగడుతున్నారు. ఇవన్నీ పూర్తయ్యాక, భారత్ అధికారికంగా, పూర్తిస్థాయిలో స్పందిస్తే, అప్పుడు ఏ ప్రపంచ దేశం కూడా వేలెత్తి చూపడానికి ఆస్కారం ఉండదు.

ఇక ప్రచార యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శత్రుదేశం అబద్ధపు ప్రచారాలతో బురద జల్లే ప్రయత్నం చేస్తే, భారత్ వాస్తవాలను ప్రపంచం ముందుంచి వారి కుట్రలను తిప్పికొడుతోంది. మన దేశానికి అనుకూలంగా, శత్రు కుయుక్తులకు వ్యతిరేకంగా ఈ ప్రచార పర్వం కొనసాగుతూనే ఉంటుంది. వాస్తవానికి, తమ దేశంపై దాడి జరిగిందని శత్రువులే ఒప్పుకుంటున్నారంటే, అది భారత్ వ్యూహాత్మక విజయమే.

అన్ని రంగస్థలాలు సిద్ధమయ్యాక, ప్రధాని మోడీ నుంచి "గ్రీన్ సిగ్నల్" రావడమే ఆలస్యం. ఆ క్షణం వస్తే, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)ను స్వాధీనం చేసుకోవడమా, లేక శత్రువుల సైనిక స్థావరాలను, ఉగ్రవాద మౌలిక సదుపాయాలను సమూలంగా బూడిద చేయడమా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ, ఆ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఊహించడానికే భయానకంగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. గంటల్లోనే సీన్ మారిపోవడం, పాక్ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. ప్రస్తుతం దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. మోడీ ఏం నిర్ణయం తీసుకుంటారు, ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: