భారత్, పాకిస్తాన్ మధ్య బీకర యుద్ధం కొనసాగుతోంది. ముఖ్యంగా ఫాక్ ఉగ్రవాదులను ఏరి వేసేందుకు ఇండియన్ ఆర్మీ రక్షణ దళాలు కూడా చాలా కసితో పనిచేస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా మారడంతో తిరిగి యుద్ధం చేయలేక పలు రకాల వాటితో భారత్ పైన ప్రతీకారం తీర్చుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అయితే ఇలాంటి సమయంలో భారత విమానాశ్రయాలకు సంబంధించి..AAI ఒక కీలకమైన ప్రకటన చేసింది. తాజాగా ఉన్న పరిస్థితులను చూసి దేశంలో 32 విమానాశ్రయాలలో అన్ని రకాల విమాన కార్యకలాపాలన సైతం నిలిపివేసినట్లుగా సమాచారం.


అందుకు సంబంధించి విమానాశ్రయాలు వివరాలను కూడా అందించింది AAI. వివరాల ప్రకారం పశ్చిమ, ఉత్తర భారత దేశంలో పలు రకాల విమానాశ్రయాలను నిలిపివేశారట. 32 విమానాశ్రయాలలో అన్ని రకాల కూడా పౌర విమాన ప్రయాణాలకు సంబంధించిన వాటిని నిలిపివేసినట్లు తెలుస్తోంది. భారత్ ,పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. మే 8న మొదట 24 విమానాశ్రయాలను సైతం మూసివేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా మరొక 32 విమానాశ్రయాలను మూసివేశారు.


అందులో అమృత్ సర్, జమ్మూ, పోర్ బందర్, చండీగఢ్, జైసల్మెర్, పటియాల, పఠాన్ కోట, బంటిడా, బికానేర్, అవంతి పూర్, భూజ్, హల్వారా, అంబాల, జామ్ నగర్, అదమ్ పూర్, హిండాన్, జోద్ పూర్, కండ్ల, కేశోద్, లుధియానా, ముంద్రా, కిషన్గడ్, కాంగ్రా, నలియా, రాజ్కోట్, సిమ్లా, సర్సావా, శ్రీనగర్, ఉత్తర్లే థోయిస్ లాంటి వాటిలో విమానాయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశారు. దీంతో టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులకు పూర్తి వాపస్సు లేదా ఒకసారి ఉచితంగా రీ షెడ్యూల్ చేసుకుని అవకాశాన్ని కల్పిస్తారట. వీటితోపాటు ఇండిగో సంస్థ కూడా NOTAM పరిధిలోకి వచ్చే పలు రకాల నగరాలను కూడా తమ సేవలను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: