పహల్గాం దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పాకు ఉగ్రవాదులను మట్టుబెట్టాలని నినాదాలు చేశారు. దీంతో మోడీ ఆపరేషన్ సిందూర్ ను స్టార్ట్ చేసి ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా పాక్ ఆర్మీ బేస్ లపై దాడి చేసి తీవ్ర నష్టం కలిగించారు. ఇక యుద్ధంలో పాకిస్తాన్ ను పూర్తిగా నాశనం చేస్తుందని జనాలంతా భావించారు. ఇంతలోనే యుద్ధం ముగిసిందంటూ అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీంతో భారత దేశవ్యాప్తంగా మోడీ మానియా ఇంతేనా?అమెరికా చెప్తే వింటారా?యుద్ధం చేసి పూర్తిగా పాకిస్తాన్ ను మట్టుకరిపించాలి కానీ ఇలా మధ్యలోనే వదిలిపెట్టడమేంటంటూ ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో ఇందిరాగాంధీ చేసినంత పని కూడా మీరు చేయలేదని ఏకి పారేస్తున్నారు..1971లో పాకిస్తాన్ తో ఇందిరాగాంధీ యుద్ధం చేశారు. ఆ టైంలో కూడా అగ్రరాజ్యం  అమెరికా ఆధిపత్యాన్ని చలాయించింది. అంతేకాకుండా  పాకిస్తాన్ కు ఇన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేసి యుద్ధ ట్యాంకులను కూడా అందించింది. 

ఓవైపు సపోర్ట్ చేస్తూనే మరోవైపు యుద్ధాన్ని ఆపాలంటూ మధ్యవర్తిగా వహించింది. కానీ ఇందిరాగాంధీ అమెరికా మాటలను అస్సలు పట్టించుకోలేదు. పాకిస్థాన్ పై ఏకధాటిగా దాడి చేసి దాదాపు లక్ష మందికి పైగా పాకిస్తాన్ సైనికులను అదుపులోకి తీసుకున్నారు ఇండియన్ ఆర్మీ. అంతేకాకుండా పాకిస్తాన్ ఇచ్చిన యుద్ధ ట్యాంకులను కూడా పూర్తిగా పేల్చివేశారు. అలాగే అమెరికా, బర్మా లాంటి షెల్ కంపెనీలు మన దేశానికి చమురు సరాపరాలను నిలిపివేస్తే  ఇందిరాగాంధీ భయపడకుండా  ఉక్రెయిన్ దేశం ద్వారా చమురు తెప్పించారు. అలాగే ఇండియాలో కూడా ఇండియన్ ఆయిల్ అనే కంపెనీ ఏర్పాటు చేశారు. అమెరికా మాటను బేకతారు చేసి పాకిస్థాన్ పై విరుచుకుపడ్డారు. అదే సమయంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునే సమయం వచ్చినా కానీ ఎందుకో ఇందిరా సైలెంట్ అయిపోయారు. 

నెలల పాటు పాకిస్తాన్ సైనికులను బంధించి ఆ తర్వాత వదిలిపెట్టారు. దానికి పాకిస్తాన్ కు చుక్కలు చూపించారని చెప్పవచ్చు. ఇందిరా గాంధీ పాలన సమయంలో భారతదేశం  ఎకనామికల్ గా చాలా వెనుకబడిపోయి ఉండేది. అయినా ఇతర దేశాలకు అమెరికాకు ఇందిరాగాంధీ భయపడకుండా పాకిస్థాన్ ను ఎదుర్కొంది. ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే టాప్ 5 ఎకనామికల్ దేశాల్లో ఒకటిగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా కూడా అంత పెద్ద దేశంగా విరాజిల్లడం లేదు. ఇలాంటి సమయంలో మోడీ పాకిస్థాన్ ను పూకటివేళ్లతో పెకిలించకుండా, అమెరికా మాట విని సైలెంట్ అయిపోయారు. దీంతో భారత దేశవ్యాప్తంగా మోడీ ఇందిరా కంటే గట్టివాడు అనుకుంటే, ఉట్టోడు అనిపించుకున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి మోడీ ప్లానింగ్ వెనక ఏదైనా ఆంతర్యం ఉందా?అమెరికా మాటనమ్మీ యుద్ధాన్ని ఆపారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: