
విషయం ఏంటంటే, మొన్నామధ్య మనవాళ్లు పాక్ ఉగ్రస్థావరాలపై జరిపిన దాడుల్లో సుమారు వంద మందికి పైగా ఉగ్రవాదులు పరలోకానికి టికెట్ తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో, కాందహార్ విమాన హైజాక్ సూత్రధారి, ముంబై దాడుల మాస్టర్ మైండ్, అనేక విధ్వంసాలకు కేరాఫ్ అడ్రస్ అయిన హఫీజ్ సయీద్ కుటుంబ సభ్యులు కూడా ఓ 14 మంది ఖతం అయ్యారు. ఆపరేషన్ టైంలో ఈ పెద్దమనిషి హఫీజ్ గాడు తృటిలో మిస్సయ్యాడు.
"అయ్యో, నేను కూడా అక్కడే ఉంటే స్వర్గానికి పోయేవాణ్ణి కదా" అని తర్వాత ఫీలయ్యాడట ఈ నరరూప రాక్షసుడు. వాడుంటే మనందరికీ ఇంకా సంతోషంగా ఉండేది, అది వేరే విషయం. ఇక్కడే ఉంది అసలు కిరికిరి. చనిపోయిన ఆ 14 మంది ఉగ్రకుటుంబ సభ్యులకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు తలా ఓ కోటి రూపాయల చొప్పున, మొత్తం 14 కోట్ల రూపాయల భారీ నజరానా ప్రకటించిందట.
అంటే, ఉగ్రవాదులు చస్తే, వాళ్ల నాయకుడికి నష్టపరిహారం ఇచ్చే ఏకైక ఉగ్రవాద పోషక దేశంగా పాకిస్తాన్ చరిత్ర సృష్టించింది. అంతకుముందు, ఈ చచ్చిన ఉగ్రవాదుల అంత్యక్రియలను కూడా ప్రభుత్వ లాంఛనాలతో జరిపి, తమది ఉగ్రవాదుల ప్రభుత్వమేనని నిస్సిగ్గుగా ఒప్పుకుంది.
ఇలాంటి పనులు చేసే పాకిస్థాన్‌ను కొందరు పెద్దన్నలు, యూరప్ దేశాలు "బాధిత దేశం" అంటూ వెనకేసుకురావడం చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. తమకు నొప్పి తగిలినప్పుడు మాత్రం ప్రపంచానికి నీతులు చెప్పే వీళ్లు, భారత్ లాంటి దేశాలు ఉగ్రవాద దాడులతో నెత్తురోడుతుంటే, "అవి కాశ్మీరీ సమరయోధుల చర్యలు" అంటూ పాకిస్తాన్ పాట పాడతారు. ఎందుకంటే, హిందూత్వంపై ద్వేషమో, ఎదుగుతున్న భారత్ అంటే కడుపుమంటో, కారణం ఏదైనా వాళ్ల వైఖరి మాత్రం ఇంతే.
భారత్ మాత్రం పాకిస్తాన్ ఉగ్రవాద నిజస్వరూపాన్ని పదేపదే ప్రపంచం ముందు నగ్నంగా నిలబెడుతూనే ఉంది. అయినా, "ప్రజాస్వామ్యం మా సొత్తు" అంటూ ప్రగల్భాలు పలికే పాకిస్తాన్, ఉగ్రవాదులకు ఇలా కోట్లతో పట్టాభిషేకం చేస్తుంటే, కొందరు మనదేశంలోనే దానికి శభాష్ అంటూ భజన చేయడం మరో విడ్డూరం. ఉగ్రవాదానికి ఆర్థిక ఊతమిస్తూ, ఉగ్రకుటుంబాలకు ప్యాకేజీలిచ్చే దేశం గురించి ఇంకా ఏం చెప్పగలం.