ఇజ్రాయెట్ గాజా మ‌ధ్య వివాదం ఆర‌ని నిప్పులా మండుతూనే ఉంది. ఇజ్రాయెల్ వ‌రుస దాడుల‌తో గాజా న‌గ‌రం వ‌ణికిపోతోంది. ఇప్ప‌టిఏ గాజాలో వేలాది మంది అమాయ‌క‌ప్ర‌జ‌లు క‌న్నుమూశారు. ఈ నేపథ్యంలో సాధ్య‌మైనంత వ‌ర‌కు గాజా ప్ర‌జ‌ల‌కు సహాయ‌క చ‌ర్య‌లు అందించాల‌ని యునైటెడ్ నేష‌న్స్ ఆకాంక్షించింది. లేదంటే తీవ్ర ప‌రిణామాలు చోటు చేసుకునే అవ‌కాశం ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. గాజా ప్ర‌జ‌ల‌కు త‌క్ష‌ణసాయం అంద‌క‌పోతే మ‌రో 48 గంట‌ల్లోనే 14 వేల మందికి పైగా చిన్నారులు మ‌ర‌ణిస్తార‌ని హెచ్చ‌రించింది. యునైటెడ్ నేష‌న్స్ హ్యుమ‌న్ టేరియ‌న్ చీఫ్ టామ్ ఫ్లెచ‌ర్ ఋ మేర‌కు వివ‌రాల‌ను మీడియాకు వెల్ల‌డించారు. 

చిన్నారుల‌కు ఆహారం అందించేందుకు తీసుకువెళుతున్న ట్ర‌క్కులు ఇప్ప‌టికే గాజా ప్రాంతంలోనికి ప్ర‌వేశించాయ‌ని చెప్పారు. ఈ ఆహారం చిన్నారుల‌కు అంద‌క‌పోతే వారు మ‌ర‌ణిస్తార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గాజాలోని చిన్నారులు ఇప్ప‌టికే పోష‌కాహార లోపంతో త‌ల్ల‌డిల్లుతున్నార‌ని చెప్పారు. వారి కోసం మ‌రికొన్ని ట్రుక్కుల ఆహారం గాజాలోకి తీసుకువెళ‌తామ‌ని ప్ర‌క‌టించారు. రాబోయే 48 గంట‌ల్లో 14వేల మంది చిన్నారులను యునైటెడ్ నేష‌న్స్ ర‌క్షించుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. వారికి సాయం చేసేందుకు గాజాలో బ‌ల‌మైన బృందాలు ప‌నిచేస్తున్నాయ‌ని అన్నాఆరు. 

ఈ బృందాలు వైద్య కేంద్రాలు మ‌రియు పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్నాయ‌ని తెలిపారు. అంతే కాకుండా స్థానికంగా వారు ప‌రిస్థితితుల‌ను అంచ‌నా వేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. సాయం చేస్తున్న‌వారిలో కూడా చాలా మంది చ‌నిపోయార‌ని ఫ్లెచ‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల‌ను చాలా దేశాలు ఖండిస్తున్నాయి. గాజాకు ఆంక్ష‌లు ఎత్తేయ‌కుండా సంయుక్తంగా ఇజ్రాయెల్ పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రిస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఇజ్రాయెల్ లోని నేత‌న్యాహు ప్ర‌భుత్వం వెన‌క్కి తగ్గ‌డంలేదు. దీంతో రెండు దేశాల్లో ఆందోళ‌న‌క ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే గాజాను ఇజ్రాయెల్ పూర్తిగా నాశనం చేసే అవ‌కాశాలు కూడా లేక‌పోలేదు. ఇప్ప‌టికే ప‌లు ప్రాంతాల‌ను ఇజ్రాయెల్ ఆధీనంలోకి తెచ్చుకునే ప్ర‌య‌త్నం కూడా చేస్తోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: