చంద్రబాబు నాయుడు ..మహానాడుని ఎంత ప్రతిష్టత్మకంగా తీసుకుంటారు అనే విషయం అందరికీ తెలిసిందే . ఆ కారణంగానే మహానాడు ను చాలా గ్రాండ్ గా ఎక్కడ ఏ తప్పులు జరగకుండా నిర్వహించేలా చూస్తూ ఉంటారు.  కాగా రీసెంట్గా ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఉదయం అంతా నీతి అయోగ్ సమావేశంలో ప్రధానితో పాటే పాల్గొన్న చంద్రబాబు ఆ తర్వాత మంచి ప్రజెంటేషన్ ఇచ్చారని ప్రధానితో కితాబు అందుకున్నారు.  అంతేకాదు ఆ తర్వాత మరోసారి ఐదు నిమిషాల పాటు ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుని అయినని స్పెషల్ గా కలిశారు చంద్రబాబు .


రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యల గురించి అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది . ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ టిడిపి నిర్వహిస్తున్న మహానాడు పై స్పెషల్ గా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం అందుతుంది . మహానాడు పై ఆరా తీశారని తెలుస్తుంది . "మహానాడు నిర్వహిస్తున్నారటగా అని ఆయన ప్రశ్నించగా.. అది పార్టీ కార్యక్రమం అని .. ప్రతిసారి నిర్వహించుకుంటూ వస్తామని ..చంద్రబాబు బదిలిచ్చారట".  అంతేకాదు పార్టీ ఆవిర్భావం నుంచి ఒక సిద్ధాంతం ప్రకారం  ఇది పనిచేస్తుంది అని ఇది ఎప్పటికీ కొనసాగిస్తూనే ఉంటామని ఆయన వివరించారట .



ఈ మూమెంట్ లోనే అసలు మహానాడు అంటే ఏంటి..? ఏ సమయంలో చేస్తారు..? ఎంతమంది వస్తారు..? ఎన్ని రోజులు చేస్తారు ..? అనే చర్చ కూడా జరిగిందట . ఈ టైం లోనే మోడీ స్పందిస్తూ "మహానాడుకు వచ్చే అతిధులకు తృణధాన్యాలతో చేసిన వంటకాలు రుచి  చూపించాలని కోరారట.  తృణధాన్యాల సాగును విక్రయాలను కూడా కేంద్రం ప్రోత్సహిస్తుంది అని .. ప్రస్తుతం ప్రపంచానికి తరుణ ధ్యానాలతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని ..మోడీ స్వయంగా చెప్పారట". ఆ కారణంగానే మహానాడులో ఏదో ఒక ప్రత్యేక వంటలతో చేసి ఆ పదార్థాలను వండించాలి అన్నట్లు డిసైడ్ అయ్యారట చంద్రబాబు . మోదీ  సూచనలను సీఎం చంద్రబాబు కూడా చాలా హ్యాపీగానే అంగీకరించినట్లు తెలుస్తుంది. తాజాగా తృణ ధాన్యాలతో కూడిన వంటకాలు తయారు చేసే నిపుణుల కోసం టిడిపి నాయకులు ఆరాతీస్తున్నట్లు తెలుస్తుంది . ఈ ఒక్క మాట బట్టి చెప్పేయొచ్చు ప్రధాని సూచనలను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తూ చా తప్పకుండా పాటిస్తాడు అని అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: