మనకు తెలిసిందే ప్రతి ఏడాది ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే 27వ తేదీ 28వ తేదీ 29వ తేదీలలో అన్ని వర్గాలను ఆహ్వానించి నిర్వహించే విశాల వేదిక మహానాడు . ఈ మహానాడు ను బాగా బాగా సెలబ్రేట్ చేస్తుంది టిడిపి పార్టి. మరీ ముఖ్యంగా  కార్యకర్తలు టిడిపి తమ్ముళ్లు మూడు రోజులు పాటు జరుపుకునే అది పెద్దపండగే ఇది అని చెప్పాలి . చాలామంది ఇది అతి పెద్ద పసుపు పండగ అని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు . ప్రజాస్వామ్య విలువల సంకల్పం ఆనాటి పాలకుల ఏకపక్ష అధికారానికి అహంకారానికి ప్రత్యామ్నాయంగా ఈ జెండా కొత్తదారి చూపింది అని జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటూ వస్తున్నారు.


కాగా పేదోడికి పట్టెడు అన్నం.. పక్కా ఇల్లు నిర్మించి నీడనివ్వాలి అనేది ఎన్టీఆర్ దగ్గర నుంచే మొదలైంది . 1982లో ఆంధ్రప్రదేశ్లో 43 ఏళ్ల నాడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎంత సెన్సేషన్ గా మారిందో అందరికీ తెలిసిందే . కాగా 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం జరుగుతున్న మహానాడు వేదిక కావడంతో దీన్ని ఘనంగా నిర్వహించేందుకు టిడిపి ముఖ్య నేతలు ఎన్నో నెలలుగా శ్రమిస్తూ వస్తున్నారు.  మరీ ముఖ్యంగా మహానాడుకు వచ్చే జనాలకు కడుపునిండా అన్నం పెట్టి పంపించాలి అంటూ ఈసారి చాలా చాలా వెరైటీస్ తో స్వయంగా వంటలు వండిస్తున్నారు టిడిపి పార్టీ నేతలు .



ఇదే మూమెంట్లో మహానాడుకు వస్తున్న జనాల కోసం వెరైటీగా రిటర్న్ గిఫ్ట్లు కూడా ప్లాన్ చేశారట చంద్రబాబు.  ప్రతి ఒక్కరికి మహానాడు గిఫ్ట్ అందేలా తగిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారట . అంతేకాదు తెలుగు ఇంటి సాంప్రదాయం ప్రకారం మన ఇంటికి ఎవరైనా ఆడపడుచు వస్తే ఖచ్చితంగా చీర - బొట్టు - గాజులు-పూలు-స్వీట్స్  ఇచ్చి పంపిస్తాము.  మహానాడుకు వచ్చే ప్రతి మహిళలకు కూడా చంద్రబాబు చీర బొట్టు గాజులు రిటర్న్ గిఫ్ట్ గా తాంబూలం ఇచ్చి పంపించాలి అంటూ డిసైడ్ అయ్యారట. అదే విధంగా మగవాళ్ళకి పంచె - కండువా ఆకువక్క రిటర్న్ గిఫ్ట్లుగా ఇవ్వాలి అంటూ డిసైడ్ అయ్యారట . ఇది నిజంగా ఒక పెద్ద పండగే అంటున్నారు అభిమానులు. మహానాడుతో చంద్రబాబు నాయుడు రేంజ్ వేరే లెవెల్ లో మారిపోబోతుంది అని టిడిపి తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: