
విజయం లోనూ ఈవీఎంలే.. ఓటమి తర్వాత అనుమానమా ? ఒకసారి గెలిస్తే ఈవీఎంలపై ప్రశంసలు, ఓడిపోయాక మాత్రం అదే యంత్రాలపై అనుమానాలు! ఇదే అంశాన్ని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతలు ఎత్తిపొడుచుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల వ్యవస్థను విమర్శించడం సమంజసం కాదని వారు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. రహస్య ఒప్పందం ఉందా..? ఇక్కడే అసలైన మేజిక్ ఉంది. జగన్ – కేటీఆర్ మధ్య మాటల సరిపోలిక మాత్రమే కాదు, వారి వ్యూహాల్లో కూడా బలమైన సామ్యాలు కనిపిస్తున్నాయి. నేరుగా కలవకపోయినా, ఒకే విధంగా కేంద్రంపై, పూర్వపు ప్రత్యర్థులపై దాడి చేయడం, తమను ప్రత్యామ్నాయంగా ప్రొజెక్ట్ చేసుకోవడం – ఈ మౌన ఒప్పందానికి సంకేతంగా మారుతోంది. ఇది కేవలం మాటల కలయికేనా, లేక భవిష్యత్‌లో జరగబోయే కొత్త రాజకీయం పునాది కాదా అన్నది ఇప్పుడు హాట్ డిబేట్.
రెండు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే? జగన్ – కేటీఆర్ ఏకాభిప్రాయం ఒక మామూలు పరిణామం కాదు. ఇది ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలపై గేమ్ చెంజర్ అవ్వొచ్చని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మొత్తానికి... ఈవీఎంలపై విమర్శలు కేవలం ఓ అంశమే.. అసలైన రాజకీయ కథనం ఇప్పుడే మొదలవుతోంది! భవిష్యత్తులో ఇది మాటల మైత్రీగా ముగుస్తుందా? లేక కూటమిగా మారుతుందా? అనే ప్రశ్నకు సమాధానం – కాలమే చెప్తుంది!