
అలాగే ఈ విషయాన్ని తక్షణమే అమలులోకి తీసుకువచ్చేలా చేస్తున్నామంటూ నిన్నటి రోజున రాత్రి ఒక ప్రకటన చేశారు .అనుమతి లేకుండా ఎవరైనా సరే ప్రదర్శనలు ఇచ్చి పారితోషకం చెల్లించకపోతే" మా" బాధ్యత వహించదు అంటూ తెలియజేశారు మంచు విష్ణు. గత ఏడాది జరిగిన ప్రముఖ అవార్డుల సంస్థ సైమలో ఒక స్కామ్ జరిగిందని ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ "మా "లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు.
గత ఏడాది జరిగిన అవార్డు ఫంక్షన్లలో తన పెర్ఫార్మషన్స్ కు పారితోషకం ఇవ్వకుండానే మోసం చేశారని తనకు జరిగిన అన్యాయాన్ని" మా "వద్ద వచ్చి ఆమె వివరించింది.. ఈ ఫిర్యాదు పైన సంధించి మంచు విష్ణు క్యాస్టింగ్ మేనేజర్స్ తో సహా సమావేశమై కళాకారుల హక్కుల రక్షణ కోసమే ఇలాంటి కొత్త నిబంధనలను తీసుకువచ్చామని తెలియజేశారు. మరి తెలుగు సినీ పరిశ్రమలో మా అధ్యక్షుడు మంచు విష్ణు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల సినీ కార్మికులు హర్షం తెలియజేస్తున్నారు. మరి ఈ పద్ధతిని పాటిస్తారో లేదో చూడాలి. మంచి విష్ణు సిని కెరియర్ విషయానికి వస్తే.. ఈ ఏడాది కన్నప్ప సినిమాని పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ చేశారు. ఈ సినిమాతో పరవాలేదు అనిపించుకున్నారు.