
నాకు ఒక్కడే కొడుకు అని ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చాడని తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయాడని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం, డిప్యూటీ సీఎం మా ఇంటికి వచ్చి పరామర్శించినా చనిపోయిన నా బిడ్డను తీసుకురాలేరని ఆయన పేర్కొన్నారు. అందుకే కనీసం నా కొడుకు మృతదేహాన్ని అప్పగించండని చెప్పుకొచ్చారు. దయచేసి పోస్టుమార్టం పేరుతో నా బిడ్డ శరీరాన్ని ముక్కలు చేయకండని అన్నారు.
ఈ తొక్కిసలాటలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. రూల్స్ ప్రకారం మృతదేహాలకు పంచనామా నిర్వహించి కుటుంబ సభ్యులను అప్పగించనున్నారు. ఈ ఘటనలో మరో 50 మంది వరకు గాయపడ్డారు. ఈ 50 మందిలో కొంతమంది పరిస్థితి సీరియస్ గా ఉందని భోగట్టా. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనపై ఇప్పటికే విచారణకు సైతం ఆదేశించారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బాధిత కుటుంబాలకు క్షమాపణలు తెలియజేయడం గమనార్హం. దాదాపుగా 18 ఏళ్ల నిరీక్షణ అనంతరం ఆర్సీబీ ఐపీఎల్ కప్ ను సొంతం చేసుకుంది. 35 వేల మంది కెపాసిటీ ఉన్న స్టేడియంకు 3 లక్షల మంది రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన సమయంలో వర్షం రావడం మృతుల సంఖ్య పెరగడానికి కారణమైంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు